అర్హులైన ప్రతి పోడు రైతుకు పట్టా : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ప్రభుత్వం అర్జ్హుత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా పంపిణీ చేసేందుకు గాను నవంబర్‌ 8వ తేదీ నుండి డిసెంబర్‌ 8వ తేదీ వరకు పోడు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు క్లెయిమ్స్‌ తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాజేశం, జిల్లా అటవీ అధికారి శాంతారామ్‌, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్‌.ఓ. ఎఫ్‌.ఆర్‌. చట్టం-2005 ప్రకారం పట్టా పంపిణీ చేయడం జరుగుతుందని, పట్టా పంపిణీ తరువాత అటవీ భూమి ఆక్రమణ కాకుండా చూడవలసిన బాధ్యత రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలపై ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో ఒక కమిటీ ఉంటుందని, జిల్లాలో 170 గ్రామాలను గుర్తించడం జరిగిందని, కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌.ఓ. ఎఫ్‌. ఆర్‌. చట్టం-2005 ప్రకారం అటవీ భూములలో సాగుపై తనిఖీ చేసి జిల్లా కమిటీకి నివేదిక అందించిన తరువాత పట్టా పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఎవరివైనా అభ్యర్థుల దరఖాస్తు తిరస్మరించినట్లయితే, దరఖాస్తును సవరించి, సరైన పత్రాలు జత చేసి తిరిగి సమర్ప్చించవచ్చని, అర్జ్హుత గల వారిని గుర్తించి పట్టా అందజేయడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా అటవీ భూములలో ఉన్న చెట్లు నరకకూడదని, నరికినట్లయితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post