అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*ఈ నెల 1 వ తేదీ 30 వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమం*

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 1: జిల్లాలో 1 జనవరి, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో ఓటరు నమోదుపై భారత ఎన్నికల కమీషన్ రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 1 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదు, చిరునామాలో మార్పులు, ఇతర సవరణలు చేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఓటు హక్కును పొందాలని సూచించారు. www.voterportal.eci.gov.in అనే వెబ్ సైట్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. సందేహాల నివృత్తి కోసం ఓటరు హెల్ప్ లైన్ నెంబర్ 1950 ను, సమీపంలోని బూత్ లెవల్ అధికారిని సంప్రదించాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఇంఛార్జి రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీఆర్డీఓ కె.కౌటిల్య, డీపీఓ రవీందర్, డీఏఓ రణధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post