అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు పథకం వర్తింప జేస్తామని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు.

మంగళవారం నాడు అదనపు కలెక్టర్ సంధ్యారాణి కమలపూర్ మండలం ఉప్పల్ గ్రామము లో పర్యటించి దళిత బంధు పధకం పై అవగాహన కల్పించారు. లబ్ధిదారులసెల్ ఫోన్ లో వచ్చే నగదు మెసేజ్ లపై అరా తీశారు. అనంతరం గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ దళిత బంధు పేరిట లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఖాతాలు తెరిచామని, వారి ఆన్ లైన్ ఖాతాలో 90 శాతం లబ్ధిదారులకు జమ చేశామని అన్నారు. ఒక్కొక్కరికి బాంక్ ఖాతాలో 9లక్షల 90 వేల రూపాయలు, మిగతా పది వేలు రక్షణ నిధి కింద జమ.చేసినట్లు తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరికి దళిత బంధు పథకం వర్తిస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ భరోసానిచ్చారు. సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కారిస్తామని అన్నారు. దళిత బంధు పథకం క్రింద కొత్తగా దరఖాస్తు చేసుకొనే లబ్ధిదారులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దళిత బంధు పథకం అమలు చేస్తామన్నారు. దళితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె భరోసాను ఇచ్చారు

ఈ సమావేశంలో ఏఎంపిటిసి సంపత్ రావు, సర్పంచ్ ఎర్రవల్లి దేవేందర్ రావు , ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post