అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ:: లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వెంకట రెడ్డి

ప్రచురణార్థం—-1

తేదీ.21.4.2022

ప్రచురణార్థం----1 తేదీ.21.4.2022 అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ:: లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వెంకట రెడ్డి జగిత్యాల ఏప్రిల్ 21:- కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ ద్వారా PM కిసాన్ లబ్దిదారులందరికి రుణ సదుపాయం కల్పించడానికి 'కిసాన్ క్రెడిట్ కార్డ్' లను జారి చేయవలసినదిగా బ్యాంకులను ఆదేశించడము జరిగిందని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం కిసాన్ లబ్ది దారులందరు సంబంధిత్ బ్యాంక్ శాఖల ద్వారా 'కిసాన్ క్రెడిట్ కార్డ్'లు పొందుటకు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని, వారి భూమి యొక్క పట్ట తాలుకా జిరాక్స్ కాపీ , పంట వివరాలను సంబంధిత శాఖలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు . కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్నీ బ్యాంకుల వారు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక కౌంటర్ ద్వారా పీఎం కిసాన్ లబ్ధిదారులకు వారి దరఖాస్తులను స్వీకరించిన 14 రోజుల్లో 'కిసాన్ క్రెడిట్ కార్డ్' లను అందజేయాలని అన్నారు. ఈ ప్రత్యేక శిబిరంలో సంబంధిత వ్యవసాయ, పశు సంరక్షణ, మత్స్య శాఖ, రెవెన్యూ అధికారులు - పంచాయతీ కార్యదర్శి , NRLM ప్రాజెక్ట్ యొక్క బ్యాంకు సఖి అందరూ పి ఎం కిసాన్ లబ్దిదారులందరికి అవగాహన కల్పించి వారు సంబంధిత బ్యాంకు శాఖల ద్వారా 'కిసాన్‌ క్రెడిట్‌ కార్డు' లూ పొందుకొరకు సహకరించాలని కోరారు ‌ కిసాన్ క్రెడిట్ కార్డ్' ద్వార రుణ సదుపాయం పశుపాలన చేయు రైతులకు మరియు మత్స్యకారులకు కూడా విస్తరించడమైనది . 'కిసాన్ క్రెడిట్ కార్డ్'ల ద్వార రుణ సదుపాయం పొందు రైతులు పశుపాలన , మత్స్యకారు పరిశ్రమలను చేపట్టిన యెడల వారికి బ్యాంకు బ్రాంచిల వారు అదనపు రుణ పరిమితి కల్పిస్తారని తెలిపారు. ఈ పథకం ద్వార 3 లక్షల రూపాయల వరకు 'కిసాన్ క్రెడిట్ కార్డ్'ల ద్వార రుణ సదుపాయం పొందు లబ్దిదారులకు బ్యాంక్ బ్రాంచిల వారు ఎటువంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ మరియు లెడ్జర్ ఫోలియో చార్లు లేకుండా రుణ సదుపాయం అందించబడుతుందని, పీఎం కిసాన్ లబ్దిదారులందరికి 'PM-కిసాన్ పోర్టల్' ద్వారా ఎస్ ఎంఎస్ లు సంబందిత బ్యాంకు శాఖలకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డులు పొందవలెనని జారి చేయడమైనది. కేంద్ర ప్రభుత్వ ఆదేశములకు పీఎం కిసాన్ లబ్దిదారులందరికి ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు పై పంటలకు రుణములు మాత్రమే కాదు, పసు సంపద, అనగా పాల వుత్పత్తులు, గొర్రెలు మరియు మేకల పెంపకము, కోళ్ళ పెంపకము మరియు బాతుల పెంపకమునకు కావలిసిన పని మూల ధన అవసరాలు (working capital) రుణ సదుపాయం బ్యాంకుల ద్వార కల్పించబడునని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ:: లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వెంకట రెడ్

జగిత్యాల ఏప్రిల్ 21:- కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ ద్వారా PM కిసాన్ లబ్దిదారులందరికి రుణ సదుపాయం కల్పించడానికి ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ లను జారి చేయవలసినదిగా బ్యాంకులను ఆదేశించడము జరిగిందని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.

పీఎం కిసాన్ లబ్ది దారులందరు సంబంధిత్ బ్యాంక్ శాఖల ద్వారా ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’లు పొందుటకు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని, వారి భూమి యొక్క పట్ట తాలుకా జిరాక్స్ కాపీ , పంట వివరాలను సంబంధిత శాఖలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు .

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్నీ బ్యాంకుల వారు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక కౌంటర్ ద్వారా పీఎం కిసాన్ లబ్ధిదారులకు వారి దరఖాస్తులను స్వీకరించిన 14 రోజుల్లో ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ లను అందజేయాలని అన్నారు.

ఈ ప్రత్యేక శిబిరంలో సంబంధిత వ్యవసాయ, పశు సంరక్షణ, మత్స్య శాఖ, రెవెన్యూ అధికారులు – పంచాయతీ కార్యదర్శి , NRLM ప్రాజెక్ట్ యొక్క బ్యాంకు సఖి అందరూ పి ఎం కిసాన్ లబ్దిదారులందరికి అవగాహన కల్పించి వారు సంబంధిత బ్యాంకు శాఖల ద్వారా ‘కిసాన్‌ క్రెడిట్‌ కార్డు’ లూ పొందుకొరకు సహకరించాలని కోరారు ‌

కిసాన్ క్రెడిట్ కార్డ్’ ద్వార రుణ సదుపాయం పశుపాలన చేయు రైతులకు మరియు మత్స్యకారులకు కూడా విస్తరించడమైనది . ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ల ద్వార రుణ సదుపాయం పొందు రైతులు పశుపాలన , మత్స్యకారు పరిశ్రమలను చేపట్టిన యెడల వారికి బ్యాంకు బ్రాంచిల వారు అదనపు రుణ పరిమితి కల్పిస్తారని తెలిపారు.

ఈ పథకం ద్వార 3 లక్షల రూపాయల వరకు ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ల ద్వార రుణ సదుపాయం పొందు లబ్దిదారులకు బ్యాంక్ బ్రాంచిల వారు ఎటువంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ మరియు లెడ్జర్ ఫోలియో చార్లు లేకుండా రుణ సదుపాయం అందించబడుతుందని, పీఎం కిసాన్ లబ్దిదారులందరికి ‘PM-కిసాన్ పోర్టల్’ ద్వారా ఎస్ ఎంఎస్ లు సంబందిత బ్యాంకు శాఖలకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డులు పొందవలెనని జారి చేయడమైనది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశములకు పీఎం కిసాన్ లబ్దిదారులందరికి ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు పై పంటలకు రుణములు మాత్రమే కాదు, పసు సంపద, అనగా పాల వుత్పత్తులు, గొర్రెలు మరియు మేకల పెంపకము, కోళ్ళ పెంపకము మరియు బాతుల పెంపకమునకు కావలిసిన పని మూల ధన అవసరాలు (working capital) రుణ సదుపాయం బ్యాంకుల ద్వార కల్పించబడునని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post