అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తాం… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్ధం

అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తాం…

మహబూబాబాద్ ఆగస్టు 30.

అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తానని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన పలువురి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు.

నెల్లికుదురు మండల కేంద్రనికి చెందిన రత్నపురి ఉప్పలయ్య తాను 86% తో వికలాంగుడు నని తనకు బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రు తండా గ్రామం మూడో వార్డు లో ఎటువంటి అభివృద్ధి చేపట్టడం లేదని మురుగు కాలువలు రోడ్లు వీధి దీపాలు వంటి సమస్యలు తో ఇబ్బందులు పడుతున్నామని తక్షణ చర్యలు తీసుకోవాలని తండా యువజన సంఘం సభ్యులు నవీన్ సందీప్ రాము కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

నెల్లికుదురు మండలం లో ఆదర్శ పాఠశాల స్వీపర్ పోస్టు తనకు ఇప్పించాలని సిందిగా బాణాల సంజీ రయ్య కోరారు.

చిన్నగూడూరు మండలానికి చెందిన మొగలి వీరయ్య మూడు విడతలుగా కొక్కిరేణి వెంకట జోగారావు వద్ద 170 సర్వేనెంబర్ 7. 31 గుంటల భూమి లోని 3. 31 గుంటల భూమి తన పేరు పై మరో నాలుగు ఎకరాలు తన భార్య పై సంక్రమణ కాలం భూదాన్ లో తప్పుగా నమోదైందని 25 సంవత్సరాలుగా ఆధారపడి జీవిస్తున్న న్యాయం చేకూర్చాలని దరఖాస్తు అందించారు.

నెల్లికుదురు మండలం ఎస్సి కులానికి చెందిన దివ్యాంగురాలు మూసి పట్ల జ్యోతి తాను ఇంటర్ చదువుకున్నాం అని అంగన్వాడి సెంటర్ 2 నందు ఖాళీగా ఉన్న ఆయా పోస్టులు తనకు మంజూరు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన వారికి తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్ కొమరయ్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post