అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు అందాలి : జిల్లా కలెక్టర్.వి.పి. గౌతమ్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్దిదారులకు సకాలంలో అందేలా అధికారులు, బ్యాంకర్లు : సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

మే 30 ఖమ్మం

. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు అందాలి : జిల్లా కలెక్టర్.వి.పి. గౌతమ్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్దిదారులకు సకాలంలో అందేలా అధికారులు, బ్యాంకర్లు : సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో జిల్లా స్థాయి డిసిసి, డిఎల్ఆర్.సి  సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. 2022-23 సం. నికి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు, ప్రభుత్వ వివిధ శాఖల సబ్సిడీ ఋణాల అందజేతపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధి యూనిట్లకు సబ్సిడీ విడుదల చేసిన వాటిని బ్యాంకర్లు లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేయాలన్నారు. ఉత్పాదక యూనిట్లు పెట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలన్నారు. యూనిట్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. సన్న చిన్న కారు రైతులు పంట రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా బ్యాంకర్లు రుణాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు రుణ మాఫీతో సంబంధం లేకుండా పంట రుణాలు రెన్యువల్ చేసుకోనెలా, సకాలంలో తిరిగి చెల్లిస్తే, వడ్డీ పడదని, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకుల ద్వారా అమలు చేసే వివిధ పథకాల కింద అందించే ఆర్థిక సహాయం సకాలంలో అందించినట్లయితే వారు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ దిశగా బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు. పంట రుణాల పంపిణీ వ్యవసాయ కాల పరిమితి రుణాలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు, గృహ రుణాల వంటివాటి విషయంలో బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రుణాలు పొందిన వారు, ఆయా ఋణాలను సద్వినియోగం చేసుకున్నది, లేనిది. పర్యవేక్షణ చేయాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ దిశగా చేపడుతున్న అక్షరాస్యత శిబిరాలు ముమ్మరం చేసి, ఆర్ధిక మోసాలకు ప్రజలు గురికాకుండా చైతన్యం తేవాలన్నారు. 2022 23 సంవత్సరానికి గాను ప్రాధాన్యత రంగాలకు 3 లక్షలు 14 వేల 343 భాగాలకుగాను 5 వేల 711 కోట్ల 66 లక్షలు, అప్రధాన్యతా రంగాలకు 2 వేల 837 ఖాతాలకుగాను 168 కోట్ల 93 లక్షలు లక్ష్యంగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, ఎలిఎం చంద్రశేఖర్ రావు, ఇడి ఎస్సి కార్పొరేషన్ శ్రీరామ్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post