అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ఋణాలు అందించాలని, వారి ఉన్నతికి తోడ్పడాలని, తద్వారా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకు ప్రతినిధులకు సూచించారు.

మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకుల 2021-22 అర్ధ వార్షిక ప్రగతి సమీక్షలో బ్యాంకు ప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి వారి ఆర్థిక పురోగతికి తోడ్పడాలని, ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని తెలిపారు.  2021- 22 సంవత్సరం గడిచిన అర్ధ వార్షిక  ప్రగతికి సంబంధించి 2937  కోట్లకు గాను 1170 కోట్లు అందించి 40 శాతం ప్రగతి సాధించడం జరిగిందని తెలిపారు.  వ్యవసాయ దీర్ఘకాలిక ఋణాల కింద 47 కోట్ల 83 లక్షల లక్ష్యానికి  11 కోట్ల 50 లక్షలు సాధించినట్లు, పంట రుణాలకు సంబంధించి 83 కోట్ల 50 లక్షలకు 59 కోట్ల 13 లక్షల రుణాలు అందించి 71 శాతం సాధించినట్లు, MSME సూక్ష్మరుణ ప్రగతిలో 14 కోట్ల 66 లక్షల లక్ష్యానికి గాను  3009 మంది లబ్ధిదారులకు 9 కోట్ల 82 లక్షలు అందించి 67 శాతం సాధించడం జరిగిందని, విద్యా ఋణాలు కింద 21 కోట్ల 82  లక్షలకు ఇప్పటివరకు 116 మందికి 7  కోట్ల 13 లక్షలు అందించడం జరిగిందని తెలిపారు. వీధి వ్యాపారులకు జిల్లా లోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో  9098 మందికి గాను 8637 మందికి పది వేల రూపాయల చొప్పున ఋణం అందించి 95 శాతం  సాధించడం జరిగిందని తెలిపారు.  స్వయం సహాయక మహిళా సంఘాలకు సంబంధించి జిల్లాలో మొత్తం 13,136 గ్రూపులకు 38 కోట్ల 75 లక్షలకు గాను 5664 గ్రూపులకు  21 కోట్ల 91 లక్షలతో 61 శాతం ప్రగతి సాధించడం జరిగిందని తెలిపారు. అర్హులైన వారికి ఋణాలు అందించడంలో భాగంగా కొత్తగా వచ్చే పరిశ్రమలకు ఋణ అవకాశాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు  ఫైనాన్షియల్ లిటరసీ అవగాహన కార్యక్రమాలలో భాగస్వాములను చేసి విద్యార్థి దశ నుండే ద్వారా విద్యార్థుల స్థాయి నుండి బ్యాంకింగ్ వ్యవస్థ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రుణాలు తీసుకున్న సంఘాలు, వీధి వ్యాపారులు వారు తిరిగి చెల్లించేలా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని,  తద్వారా వారికి తిరిగి ఎక్కువ మొత్తంలో ఋణ సహాయం అందించడం సులువు అవుతుందని అన్నారు. మత్స్యశాఖ, ఉద్యానవన శాఖలు కిసాన్ క్రెడిట్ ప్లాన్ కింద ప్రతి వారము అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఋణాలు సకాలంలో గ్రౌండింగ్ చేపట్టాలని, వారి ఆర్థిక సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకు ప్రతినిధులకు సూచించారు.
నాబార్డు శాఖచే రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్ బ్రోచర్లను జిల్లా కలెక్టర్, బ్యాంకు ప్రతినిధులు ఆవిష్కరించారు.
కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా LDO పూర్ణిమ, జిల్లా లీడ్ మేనేజర్ రామకృష్ణ,  కెనరా బ్యాంక్ డి.ఎం.  శ్రీనివాస్,  ఎస్.బి.ఐ. బ్యాంకు  డి.ఎం. రఘోత్తమ రావు, నాబార్డ్ మేనేజర్ సత్యనారాయణ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Share This Post