అర్హులైన లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ఏప్రిల్ మొదటి వారం లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయిన కంటివేలుగు, ఆరోగ్య మహిళ, జి.ఓ 58, 59 , 76, 118 ప్రకారం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, ఇళ్ల పట్టాల కై సేకరించి ఉన్న ఖాళీ స్థలాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పోడు పట్టాలు, ఎండాకాలం వడగాల్పులు, అగ్ని ప్రమాదాల నివారణ సన్నద్ధత, ఐ.డి.ఓసి. ,పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల నిర్వహణ,తెలంగాణకు హరితహారం పై కలెక్టర్లు, ఆదనవు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు గుర్తించిన ఇళ్ళు కేటాయింపు చేసి ఆన్లైన్ లో వివరాలు అప్లోడ్ చేయాలని ఏప్రిల్ మొదటి వారం లోవు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కంటి వెలుగులో ప్రెస్క్రిప్షన్ అద్దాల పంపిణీ ఎప్పటికప్పుడు జరగాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష మాట్లాడుతూ కంటివేలుగు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు.
వడగాల్పులు, అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు విజవంతంగా కొనసాగుతున్నాయని, వచ్చే నెల 3 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.
హరితహారం లో నాటిన ప్రతి మొక్కను బతికించుకునేవిధంగా వాచ్ అండ్ వార్డుల ద్వారా నీరు పోయించడం జరుగుతుందన్నారు. వచ్చే హరితహారానికి నర్సరీల్లో అవసరమైన మొక్కలు సిద్ధం చేసుకోవడం జరుగుతుందని తెలియజేసారు. జిల్లాలో అటవీ శాతం చాలా తక్కువ గా ఉండటంతో 80 ఎకరాల స్థలం గుర్తించడం జరిగిందని ఇక్కడ అటవీ శాతం పెంచేందుకు నర్సాపూర్ అర్బన్ యూకో పార్క్ తరహాలో పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలియజేసారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదనవు కలెక్టర్ మయాంక్ మిత్తల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.