DPRO ADB- అర్హులైన వారందరి పేర్లు ఓటర్ జాబితాలో నమోదు చేయండి- రోల్ ఆబ్సర్వర్ సి.సుదర్శన్ రెడ్డి.

ఓటర్ నమోదు పై మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన వారి పేర్లను వందశాతం నమోదు చేయాలనీ ఓటర్ జాబితా పరిశీలకులు, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి కార్యదర్శి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి ERO లు, AERO లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వయసుగల వారందరి పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేసే విధంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఆన్ లైన్ ఎన్రోల్మెంట్ విధానంతో ఓటర్ నమోదును వారి ఇంటిముందే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 40 శాతం ఎన్రోల్మెంట్ జరిగిందని, ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం 90 శాతం ఎన్రోల్మెంట్ జరగాలని అన్నారు. బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని ఓటర్లను గుర్తించి నమోదు చేసే విధంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్న తీరు సంతృప్తీ కరంగా ఉందని అన్నారు. బూత్ స్థాయి అధికారులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారని, వారికీ సకాలంలో రెమ్యునరేషన్ అందేవిధంగా చూడాలని సూచించారు. జిల్లాలో అవగాహన కార్యక్రమాలు సంతృప్తీ కరంగా ఉన్నాయని, స్వీప్ కొర్ కమిటీ టీమ్ ను ఆయన అభినందించారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో ఓటర్ నమోదు ఫారాలను పరిశీలించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో గత సెప్టెంబర్ మాసం నుండి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా, సమావేశాల సందర్భాలలో ఓటర్ నమోదుపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల నుండి అవగాహన కార్యక్రమాలు, నమోదు కార్యక్రమాలు నిర్వహించలేక పోయామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం క్లెయిమ్ ఫారాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వచ్చే కాలంలో 90 శాతం నమోదు చేసేందుకు కార్యాచరణ తో ముందుకు వెళ్తామని తెలిపారు. ఇప్పటివరకు 3428 ఫారం-6, 1799 ఫారం-7, 258 ఫారం-8, 166 ఫారం-8a లు రావడం జరిగిందని వాటిని పరిశీలించి ఆయా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్య వంతమైన ఓటర్ జాబితాను తయారుచేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారని వివరించారు. నోడల్ ప్రత్యేక అధికారి, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, జిల్లాలోని 14 మండల కేంద్రాలలో 582 బూత్ స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అలాగే జిల్లాలోని 25 డిగ్రీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటర్లుగా నమోదు చేయడం జరుగుచున్నదని తెలిపారు. 23 జూనియర్ కళాశాలల్లో భవిష్యత్ ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. గరుడ యాప్ అవగాహన కల్పించి వందశాతం నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. స్థానిక అల్ ఇండియా రేడియో, సిటీ కేబుల్ ల ద్వారా, వివిధ భాషలలో వాయిస్ మెసేజ్ ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతకు ముందు స్థానిక పురుషుల డిగ్రీ కళాశాల, డైట్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలీస్ లైన్ లలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి వివిధ ఫారాలను, రిజిస్టర్ లను రోల్ ఆబ్సర్వర్ పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులతో మాట్లాడుతూ, మీ పరిధిలోని ఇంటింటికి వెళ్లి 18 ఏళ్ళు నిండిన వారి పేర్లను ఓటర్ జాబితాలో చేర్చాలని సూచించారు. ఈ సందర్బంగా బూత్ స్థాయి అధికారులు మాట్లాడుతూ, తమకు రెమ్యునరేషన్ సరిగా రావడం లేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ITDA PO అంకిత్, ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, నాయబ్ తహసీల్దార్ శ్రీవాణి, సాయి మహేష్, తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు రోల్ ఆబ్సర్వర్ కు కలెక్టర్, అదనపు కలెక్టర్ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.

Share This Post