అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
——————————-
18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి యువతి, యువకులందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం
తంగళ్ళపల్లి మండల కేంద్రములోని పోలింగ్ బూత్ లు 182 ,183 , 184 , 185 ,186 , 187 , 188 , 189 లలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్ కార్యక్రమమును జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ – 2023 కార్యక్రమం ప్రభావ వంతంగా చేపట్టేందుకు బూత్ స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ – 2023 కార్యక్రమం లో భాగంగా ఈ నెల 26,27 న తిరిగి డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించి నమోదు చేయాలన్నారు. జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సలు వయసు నుండే యువతి, యువకులతో పాటు దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ లను ఫారం-6 ద్వారా ఓటర్లుగా నమోదుచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లకు వారి వివరాలలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, బిఎల్ఓ లు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలని, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండి తొలంగించాలని తెలిపారు, పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది అందరు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో తుది ఓటరు జాబితా ప్రచురణకు ముందు ఒకటికి రెండు సార్లు ఫోటోలు, పేర్లు, ఇతర వివరాలను బూత్ స్థాయి అధికారులు సరిచూసుకోవాలని అన్నారు.
ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు జరగాలని, పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చిన. ఫారం 7 దరఖాస్తులను పరిశీలించి సదరు ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న దివ్యాంగ ఓటర్ల వివరాలు చిరునామా తో మ్యాప్ చేసి పెట్టుకోవాలని, ఎన్నికల సమయంలో వారి కోసం వాహనాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు.
ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓట్లు, లాజికల్ ఎర్రర్స్ డెమోగ్రాఫిక్ ఎర్రర్స్ పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహిసీల్దార్ సదానందం, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.
——————————