అర్హులైన వారికి ఆర్థిక చేయూత దిశగా రుణ మేళా : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

అర్హులైన వారికి రుణ సదుపాయం కల్పించడం ద్వారా వారికి ఆర్థిక చేయూత నిచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వొడ్డెపల్లి గార్దెన్స్‌ ఫంక్షన్‌హాల్‌లో రుణ మేళాపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన రుణ మేళా నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా బ్యాంకులు సంయుక్తంగా మేళాను నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి అర్హులైన లబ్టిదారులు హాజరై రుణాలు పొందాలని తెలిపారు. ఈ మేళాలో ఇంటి రుణాలు, విద్యార్థుల సౌకర్యార్థం విద్యా రుణాలు, వ్యవసాయ రుణాలతో పాటు స్వయం సహాయ సంఘాలకు, వ్యాపార అభివృద్ధికి రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. లబ్టిదారులు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హన్మంతరావు, వివిధ బ్యాంకుల అధికారులు, సంబంధిత శాఖల
అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post