అర్హులైన వారికి జాబ్ కార్డ్ లు అందించాలి, జాతీయ ఉపాధి హామీ పథకం పనులను సమర్థవంతంగా నిర్వర్తించాలి -జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

అర్హులైన వారికి ఉపాధి హామీ జాబ్ కార్డ్ లు అందించి, జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను, జల శక్తి అభియాన్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వర్తించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు.
మంగళవారం బిజినపల్లి మండలం పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయం లో కృషి విజ్ఞాన్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు, జల శక్తి అభియాన్ నిర్వహణపై ఎంపీడీవోలు, ఎంపీవోలు,ఈసిలు, ఏపీవో లు, టీఏ లకు ఒక రోజు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ ఉదయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో శిక్షణను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ….
ఉపాధి హామీ పనుల రిజిస్టర్ నమోదు సక్రమంగా నిర్వహించాలని, అర్హులైన వారికి జాబ్ కార్డ్ లు అందించాలని సూచించారు.
పనులు జరిగే ప్రదేశాలలో బోర్డులు ఏర్పాటుచేసి పూర్తి వివరాలు నమోదు చేయాలని, కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని తెలిపారు. అలాగే ఉపాధి హామీ నర్సరీల నిర్వహణలో పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని అన్నారు.
నర్సరీల నిర్వహణ పనులు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పనులతో పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో 1 లక్షా 91 వేల జాబ్ కార్డులు ఉన్నాయని ఒక లక్షా 25 వేల మంది ఉపాధి పనుల్లో పాల్గొన్నారని వారికి 53 కోట్ల రూపాయలు కూలీలకు అందిందన్నారు.
జల శక్తి అభియాన్ కింద జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వర్తించి భూగర్భ జలాలను పెంచే దిశగా కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న ఎత్తిపోతల పథకాల వల్ల జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని కలెక్టర్ అన్నారు.
గ్రామీణ స్థాయిలో జల శక్తి అభియాన్ పనులను మండల స్థాయి అధికారులు పర్యవేక్షణతో సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా ఎంపీడీవోలు తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించే పర్యటనలకు సంబంధించిన ముందస్తు పర్యటన నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.
గ్రామాల్లో నిర్వర్తిస్తున్న పనుల పర్యవేక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతమైన పర్యవేక్షణాలు కొనసాగించాలన్నారు.
పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయాలన్నారు.
మండల స్థాయిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీవోలు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలన్నారు.
ఒకరోజు శిక్షణను వినియోగించుకొని ఉపాధి హామీ పనులు, జనశక్తి కార్యక్రమాల నిర్వహణను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, డీఆర్డీఓ నర్సింగ్ రావు, డిపిఓ క్రిష్ణ,జిల్లా భూగర్భ జల అధికారిని రమాదేవి, అదనపు డిఆర్డివో రాజేశ్వరి, ఏవో నటరాజ్, కృషి విజ్ఞాన్ కోర్స్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, శిక్షణ ఆర్ పి లుగా నాగర్ కర్నూల్ ఎంపీడీవో కోటేశ్వర్, కల్వకుర్తి ఎపిఓ చంద్ర సిద్ధార్థ, ఉర్కొండ ఈసీ కిషన్ లు వ్యవహరించారు. ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post