అర్హులైన వారికి న్యాయం చేకూరుస్తాం…

ప్రచురణార్థం

అర్హులైన వారికి న్యాయం చేకూరుస్తాం…

మహబూబాబాద్, నవంబర్,16.

పోడు సాగు లో అర్హులైన రైతులకు న్యాయం చేకూరుస్తానని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

మంగళవారం కలెక్టర్ నెల్లికుదురు మండలం లక్ష్మీ పురం తండా ఆలేరు గ్రామాల్లో పర్యటించారు.

ముందుగా లక్ష్మీ పురం తండాను సందర్శించి రైతులతో మాట్లాడారు అదేవిధంగా పోడు సాగుచేస్తున్న 489 ఎకరాల భూమిని సందర్శించి పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగు చేస్తున్న రైతులకు న్యాయం చేకూర్చాలని దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయం చేకూరుస్తానని అన్నారు.

రైతుల నుండి లక్ష్మీ పురం తండా, కొత్త తండా, మంగ్లీ తండా ఆవాసాల కు సంబంధించిన దరఖాస్తుల వివరాల నమోదు రిజిస్టర్ లను పరిశీలించారు.

లక్ష్మీ పురం తండా గ్రామంలో వృద్ధురాలు తేజావత్ లక్ష్మిని కలెక్టర్ పలకరించారు పింఛను పొందు తున్నానని, వ్యాక్సిన్ కూడా వేయించుకున్నానని తెలపడంతో కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం గ్రామంలో సందర్శిస్తూ నిల్వ ఉన్న నీటి పై చర్యలు తీసుకోవాలని గ్రామ పరిశుభ్రత పై దృష్టి పెట్టాలని ఎంపిడిఓ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి బాలరాజు తాసిల్దార్ రఫీ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణవేణి ఎఫ్ ఆర్ సి చైర్మన్ శంకర్ గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
——————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post