అర్హులైన వారు ఉచిత శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవాలి…

ప్రచురణార్థం

అర్హులైన వారు ఉచిత శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 13

స్వయం ఉపాధి కై అర్హులైన వారు ఉచిత శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో2019-22 సంవత్సరానికి సంబంధించి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో ఉచిత శిక్షణా కార్యక్రమాలను భోజన వసతి తో పాటుగా ఉపాధి కల్పించేందుకు శ్రీకారం చుట్ట డం జరిగిందని అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.

ఆటోమొబైల్ రంగంలో టు వీలర్ త్రి వీలర్ సర్వీసింగ్ శిక్షణకు మూడు నెలల కాల పరిమితి ఉంటుందని అందుకు పురుషులు మాత్రమే అర్హులని పదవ తరగతి పాసై ఉండాలన్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతు రంగంలో సెల్ ఫోన్ శిక్షణ కార్యక్రమానికి మూడున్నర కాలానికి గాను పదవతరగతి తో పాటుగా ఐ టి ఐ పాస్ అయి ఉండాలని ఈ శిక్షణ కార్యక్రమానికి పురుషులతో స్త్రీలు కూడా అర్హులన్నారు.
ఎలక్ట్రిషన్ గా శిక్షణ కై నాలుగు నెలల కాలానికి పదవ తరగతి తో పాటుగా ఐటిఐ పాస్ అయి ఉండాలన్నారు ఈ శిక్షణ కార్యక్రమానికి కూడా పురుషులతో మహిళలు కూడా అర్హులన్నారు.
Dtp తో పాటుగా ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్ శిక్షణకు మూడున్నర నెలల కాలానికి గాను ఇంటర్ పాస్ అయి ఉండాలని స్త్రీలు పురుషులు అర్హులని కంప్యూటర్ అకౌంటింగ్ శిక్షణకు మూడున్నర కాలానికి బీకాం పాస్ అయి ఉండాలని స్త్రీలు పురుషులు అర్హులన్నారు కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ గా మూడున్నర కాలానికి ఇంటర్ పాస్ అయి ఉండాలని స్త్రీలు పురుషులు అర్హులన్నారు సోలార్ ఎలక్ట్రికల్ సిస్టం ఇన్స్టాలర్ తోపాటు సర్వీస్ ప్రొవైడర్ శిక్షణకు మూడున్నర కాలానికి గాను పదవ తరగతి తో పాటు ఐటిఐ పాస్ అయి ఉండాలని స్త్రీలు పురుషులు అర్హులన్నారు గార్మెంట్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ శిక్షణకు గాను మూడు నెలల కాలానికి పదవ తరగతి పాస్ అయి ఉండాలని మహిళలు మాత్రమే అర్హులు అన్నారు.

శిక్షణ కార్యక్రమాలకు తమ దరఖాస్తులను తేదీ 14 సెప్టెంబర్ 2021లోగా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ జలాల్ పూర్ గ్రామం భూదాన్ పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా 508 284 లో ఉదయం 10 గంటలకల్లా హాజరు కావాలన్నారు

18 సంవత్సరాల నుండి 35 సంవత్సరముల లోపు ఆసక్తి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఒక జిరాక్స్ సెట్టును రెండు పాస్ ఫోటో లతో ఆధార్ కార్డు రేషన్ కార్డు లతో ఎంపిక కాబడిన అభ్యర్థులు 250 రూపాయలు రిఫండ్ డబుల్ డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది అన్నారు . ఇతర వివరాలకు సెల్ ఫోన్ నెంబర్ 9133 908222, 9133 908111, 9133 908000, 9948 466111 లను సంప్రదించాలన్నారు.
————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post