అర్హులైన వీధి వ్యాపారులకు రుణాలు అందించటంపై బ్యాంకు అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్ సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:06.01.2022, వనపర్తి.

అర్హులైన చిరు వ్యాపారులకు బ్యాంకు రుణాలు అందించి ఉపాధి పొందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష బ్యాంకు అధికారులకు, మునిసిపల్ కమిషనర్లకు ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన వీధి వ్యాపారులకు జాప్యం లేకుండా రుణాలు అందించి, తద్వారా వారు ఉపాధి పొందేలా అన్ని చర్యలు చేపట్టాలని బ్యాంకు అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు ఆమె సూచించారు. గతంలోనే రుణాలు పొంది, రుణ మొత్తాలను చెల్లించిన అర్హులైన వీధి వ్యాపారులకు 15 రోజుల లోపల రూ.20 వేలు, రెండవ విడత రుణ సహాయం అందించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా మొదటి సారిగా రుణ మొత్తాలను పొందుటకు అర్హులుగా ఉన్నవారికి రూ.10 వేల చొప్పున రుణాలు అందించాలని ఆమె సూచించారు.
రుణ మొత్తాలను అందించటంలో ఉత్తమ సేవలు అందించిన వారిని ఎంపిక చేసి, రాష్ట్రస్థాయి ఉత్తమ సేవ అవార్డులు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, బ్యాంకు అధికారులు రుణాలు అందించుటకు సమన్వయంతో కృషి చేయాలని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, బ్యాంకు అధికారులు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post