అర్హులైన వైద్యులు దరఖాస్తు చేసుకోవాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

*అర్హులైన వైద్యులు దరఖాస్తు చేసుకోవాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ*

——————————–
పెద్దపల్లి, డిసెంబర్ -31:
——————————–

పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులలో పనిచేయుటకు అర్హులైన వైద్యులు 2023 జనవరి 3 వరకు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ నేడోక ప్రకటనలో తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో కాంట్రాక్టు ప్రాతిపదికన (6) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులు అయిన వైద్యుల నుండి దరఖాస్తులను కోరుతున్నామని, అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారములను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో జనవరి 3 ఉదయం 11 గంటల లోపు అందజేయాలని, అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఇంటర్వ్యూ పెద్దపల్లి జిల్లా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ ఛాంబర్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆసక్తి గల స్పెషలిస్ట్ లు, MBBS వైద్యులు కూడా దరఖాస్తు చేసుకోగలరనీ, స్పెషలిస్టు వైద్యులు రాని సందర్భంలో MBBS వైద్యుల దరఖాస్తులు పరిగణించనున్నట్లు, మిగతా పూర్తి వివరాలకు సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ సెల్ నంబర్ 8499061999 లో సంప్రదించాలని, దరఖాస్తు ఫారంతో కూడిన మిగతా పూర్తి వివరాలు http://peddapalli.telangana.gov.in లో పొందాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post