అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెంచండి. జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్ 

అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెంచండి.  జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్ 

*పత్రిక ప్రచురణార్ధం*

*తేదీ: 10/01/2023*

తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ

అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెంచండి.

జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్

తేది: 10/01/2023 న కలెక్టరెట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో… జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మీటింగ్ ….శ్రీమతి.జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్, హనుమకొండ గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో…. గర్బ ధారణ పూర్వ గర్భస్థ పిండ (లింగ నిర్ధారణ) పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా

జిల్లా లో చట్ట అమలు తీరును, చేపట్టిన అవగాహన కార్యక్రమాలు మరియు పి.హెచ్.సి ల వారీగా అమ్మాయిల జననాలను సమీక్షించడo జరిగింది.

జిల్లాలో అమ్మాయిల జననలు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అదే విధముగా స్కానింగ్ పరీక్షలు దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,అక్రమంగా అబార్షన్ లు నిర్వహిస్తున్న ఆసుపత్రుల పైన మరియు స్కానింగ్ సెంటర్ ల పైన నిఘా మరియు పర్యవేక్షణ లు పెంచాలని NGO లు భాద్యత తీసుకొవాలని, గ్రామం జిల్లాలోని కళాజాత బృందాలను ఉపయోగించుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, మహిళా సమాఖ్య సభ్యుల మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్లలో పి సి పి ఎన్ డి టి చట్టంపై అవగాహన కల్పించాలని శ్రీమతి.జి. సంధ్యా రాణి, అడిష్ నల్ కలెక్టర్ ఆదేశించారు. . శ్రీమతి పద్మజ, జడ్జ్ ఫ్యామిలీ కోర్టు మరియు 2 వఅడిష్ నల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, మాట్లాడుతూ జిల్లా లో ఇన్స్పెక్షన్ టీమ్ లను పెంచాలని, రాత్రిపూట ఆకస్మిక తనిఖీలను పెంచాలని పెరుకొన్నరు.

ఈ సమావేశంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ హనుమకొండ డాక్టర్. యాకూబ్ పాషా, ఏసిపి స్పెషల్ బ్రాంచ్ అబ్దుల్ రెహమాన్, శ్రీ ఆర్ కృష్ణ మూర్తి MARI ఎన్జీవో, ఎల్. చంద్ర శేఖర్, డిప్యూటీ డెమో కే. ప్రసాద్ , మాధవ రెడ్డి పాల్గొన్నారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి

హనుమకొండ జిల్లా

జిల్లా పౌర సంబందాల శాఖాధికారి గారి ద్వారా అన్ని పత్రికలలో ప్రచురణ నిమిత్తం సమర్పించనైనది.               

Share This Post