*అవతరణ వేడుకల ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
————————————
సిరిసిల్ల 28, మే 2022 :
————————————
జూన్ 2 వ తేదీన జిల్లాలో నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టర్ అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయం పరిసరాలను కాలినడకన తిరిగి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అవతరణ వేడుకలను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
వేడుకలకు వచ్చే అతిథులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి, రాష్ట్ర అవతరణ వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యాలయ పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఓ గంగయ్య, పర్యవేక్షకులు రవికాంత్, తదితరులు ఉన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, రాజన్న సిరిసిల్లచే జారిచేయనైనది.