అవసరాలే ఆవిష్కరణలకు పునాది. – కలెక్టర్ హరిచందన

అవసరాలే  ఆవిష్కరణలకు పునాది. – కలెక్టర్  హరిచందన

 

ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్ (గోడ పత్రిక) ఆవిష్కరణ సందర్బంగా జిల్లా  కలెక్టర్  డి హరిచందన మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే “ఇంటింటా ఇన్నోవేటర్” కార్యక్రమం ఈ సంవత్సరం కూడా మొదలైనట్టు తెలిపారు. ఈ  “ఇంటింటా ఇన్నోవేటర్” కార్యక్రమం లో భాగంగా తెలంగాణ రాష్త్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC) వారు  జిల్లాలో  అన్ని రంగాలలోని ప్రజల నుండి వాట్సప్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.  గ్రామాలలో,పట్టణాలలో ఉండే అన్ని రంగాలు మరియు వర్గాల నుండి ఆవిష్కరణలను ఆహ్వానిస్తుంది.

అనగా గ్రామీణ ఆవిష్కరణలు, విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలైనవి.

ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణ వివరాలైన

  1. ఆవిష్కర్త పేరు, వయస్సు, వృత్తి , గ్రామం, జిల్లా.
  2. ఆవిష్కర్త వివరణ యొక్క వాఖ్యలు,
  3. ఆవిష్కరన యొక్క 4 చిత్రాలు.
  4. ఆవిష్కరణకు సంబంధించిన 2 నిమిషాల వీడియోను

9100678543 అనే నంబరు కు వాట్సప్ ద్వారా ఆగస్టు5వ తేదీ  వరకు  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఎంపిక అయిన ఆవిష్కరణలను జిల్లాలో జరిగే ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వాటిని ప్రదరర్శించే అవకాశం ఉంటుందని తెలిపారు.  ఆవిష్కర్తలకు సర్టిఫికేట్ ల ప్రధానం తో పాటు   TSIC టీం ద్వారా ఉత్తమ ఆవిష్కరనలకు సాంకేతిక సహకారం కూడా అందించబడుతుంది అని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో SP  వెంకటేశ్వర్లు ,  AMO  విద్యాసాగర్ ,  DSO   హెచ్  భాను ప్రకాష్, SO  శ్రీనివాస్, DPO  మురళి పాల్గొన్నారు.

Share This Post