అవినీతి నిరోధక వారోత్సవాలలో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అవినీతి నిరోధక ప్రతిజ్ఞ చేయిస్తున్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్. (కరీంనగర్ జిల్లా)

పత్రికా ప్రకటన తేదీ: 4-12-2021
కరీంనగర్

కలిసికట్టుగా అవినీతిని నిర్మూలిద్దాం

అవినీతి రహిత దేశంగా మారుద్దాం

అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

అవినీతి నిర్మూలన వారోత్సవం లో భాగంగా ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించిన అదనపు కలెక్టర్
00000

కలసికట్టుగా అవినీతిని నిర్మూలిద్దాం అని, దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చుకుందామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.

అవినీతి నిర్మూలన వారోత్సవం లో భాగంగా ( ఈనెల 3 వ తేదీ నుంచి 9వ తేదీ వరకు) శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది చేత అవినీతిని నిర్మూలిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు.

‘భారత దేశ పౌరునిగా అవినీతిని ప్రోత్సహించినని, అవినీతికి పాల్పడనని, అవినీతిని నిర్మూలించడంలో, భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా రూపు దిద్దడంలో నా వంతు కృషి చేస్తానని నా మాతృభూమి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’.

ఈ సందర్భంగా గరిమమా అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ చక్కగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. ఎవరు కూడా అవినీతికి పాల్పడ వద్దని కోరారు. సుపరిపాలనతో, అవినీతి లేని దేశంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post