అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ


అవినీతి వ్యతిరేక వారోత్సవాల నిర్వహణ :: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి,డిశంబరు 04:- ప్రభుత్వం డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9 వరకు అవినీతి వ్యతిరేక వారోత్సవాల నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టరేట్ సిబ్బంది తో కలిసి అవినీతి నిర్ములన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవినీతి దానివల్ల సమాజానికి జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని,అవినీతి నిర్మించాలనే సంకల్పంతో సమాజంలో చైతన్యం కలిగించేందుకు గాను ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది అని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ప్రజలకు అవినీతి వల్ల కలిగే నష్టాలు వివరించడంతో పాటు ఏసిబీ కార్యకలాపాల పట్ల అవగాహన కల్పించడం, వారి సందేహాలు తీర్చడం లక్ష్యంగా అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, జిల్లా ఎసిబి అధికారులు మరియు ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో అతికించడం ,కరపత్రాలు పంచడం , అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మండల స్థాయిలో నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తామని,ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువత స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగులు తమ సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ,అదనపు కలెక్టర్ కుమార్ దీపక్(లోకల్ బాడీస్),జిల్లా వైద్య అధికారి ప్రమోద్ కుమార్ ,వ్యవసాయ శాఖ అధికారి తిరుమల్ ప్రసాద్,సి.పి.ఓ.రవీందర్,కలెక్టరేట్ ఎ.ఓ.కెవై.ప్రసాద్, కలెక్టరేట్ సూపరెండేంట్ తూము రవీందర్ ,కలెక్టరేట్ సిబ్బంది,సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post