అవుట్ డోర్ తో పాటుగా ఇండోర్ క్రీడలను నిర్వహించే విధంగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ క్రిడా నిర్వాహకులను సూచించారు

అచ్ఛంపేటలో అవుట్ డోర్ తో పాటుగా ఇండోర్ క్రీడలను నిర్వహించే విధంగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ క్రిడా నిర్వాహకులను సూచించారు.    జి.ఆర్.బి. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు నిర్వహించిన ఆల్ ఇండియా లెవల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో మంగళవారం అచ్ఛంపేట క్రీడామైదానంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భముగ కలెక్టర్ టోర్నమెంట్ విజేత అయిన మన్నేవారి పల్లి క్రికెట్ టీమ్ కు బహుమతి ని ప్రధానం చేశారు.  మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు క్రీడాకారులకు పలు అవార్డులు, మెమోంటోలు ప్రధానం చేశారు.  విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అచ్ఛంపేట మున్సిపాలిటీలో ఆన్నీ రకాలైన క్రీడలను నిర్వహించే విదంగా నిర్వాహకులు సిద్దం కావాలని తెలియజేసారు.

ఈ టోర్నమెంట్ ను పూర్తి సహకారంతో ముందుండి నడిపిన అచ్ఛంపేట శాసన సభ్యులు, ప్రభుత్వ విప్  గువ్వల బాలరాజు మాట్లాడుతూ అచ్ఛంపేటను క్రీడాకారుల అడ్డా గా మార్చుతానని  అన్నారు.  ఈ నియోజక వర్గంలో క్రీడాకారులకు పూర్తి ప్రోత్సాహం అందజేయడం జరుగుతుందని క్రీడలను ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయమని హామీ ఇచ్చారు.  పది రోజులుగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా లెవల్ క్రికెట్ టోర్నమెంట్ కు దేశంలోని 10 రాష్ట్రాల నుండి క్రీడాకారులు రావడం జరిగిందని, టోర్నమెంట్ నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్  అసోసియేషన్  సహకారం అందించిందని రాబోయే రోజుల్లో మరింత సహకారం అందించి ఇక్కడ క్రీడలను ప్రోత్సహించాలని కోరారు.  రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా తాను ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగిందని ప్రభుత్వం ద్వారా ప్రతి రైతుకు రైతుబంధు, రైతు భీమా అందిస్తుందని తెలియజేసారు.

ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన  మన్నేవారి పల్లి జట్టుకు మెమోంటో తో పాటు 1.5 లక్షల చెక్కును, రన్నర్ గా నిలిచిన అచ్ఛంపేట జట్టు కు ఒక లక్ష రూపాయల చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.  టోర్నమెంట్ లో బాగా రాణించిన మోహమ్మద్ తాహర్ కు మ్యాన్ ఆఫ్ ద సీరీస్, డి. అభిరత్నకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, బెస్ట్ బౌలర్ గా 11 వికెట్లు తీసిన శాసన సభ్యులు గువ్వల బాలరాజు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహా గౌడ్, హెచ్.సి.ఏ హైద్రాబాద్ కోశాధికారి సురేందర్ అగర్వాల్, ప్రజా ప్రతినిధులు రాంబాబు, లోక్య, రాజేశ్వర్ రెడ్డి, క్రీడా నిర్వాహకులు జవేద్, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Post