ప్రచురణార్థం
అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలి…
మహబూబాబాద్, జూలై-27:
జాతీయ రహదారులలో గ్రామాలకు, గ్రామాలకు మధ్య ఉన్న రహదారులకు అవెన్యూ ప్లాంటేషన్ తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి ఏడో విడత హరితహారంపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవెన్యూ ప్లాంటేషన్ అందంగా కనిపించాలని అందుకు ట్రీ గార్డ్స్ మొక్కలు ఫిట్టింగ్ చేసిన రోజునే ఒకేసారి ఏర్పాటు చేయాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ చేసేటప్పుడు మొక్కలు మూడు అడుగుల ఎత్తు తప్పనిసరిగా ఉండాలన్నారు అదేవిధంగా ట్రీ గార్డ్స్ పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు బృహత్ పల్లె ప్రకృతి వనాలకు అటవీశాఖ ద్వారా మొక్కలు సరఫరా చేయడం జరుగుతుందని తెలియజేశారు.
స్మశానవాటిక లలోను, సెగ్రిగేషన్ షెడ్స్ లోనూ బయో ఫెన్సింగ్ చేపట్టాలని మూడు వరుసలుగా మొక్కలు నాటాలి అన్నారు. వెదురు గచ్చకాయ వంటి మొక్కలు ఎక్కువగా నాటాలి అన్నారు. నీటి సరఫరా లేని చోట ట్యాంకర్లతో సరఫరా చేయించాలని వీలుకాని పక్షంలో బోర్ల కొరకు ప్రతిపాదనలు అందించాలన్నారు. గ్రామ సర్పంచ్ సహకారం తీసుకోవాలని రోజువారి గా గుంతలు తీయించడం మొక్కలు నాటించడం ట్రీ గార్డులు పెట్టించడం నివేదికలతో అందజేయాలన్నారు. గత ప్లాంటింగ్ లో గ్యాప్ ఉన్నచోట మొక్కలు నాటించా లన్నారు. నరసింహుల పేట పెద్దవంగర దంతాలపల్లి గూడూరు మండలాలలో ప్లాంటేషన్ ను వేగవంతం చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈఓ వి వి అప్పారావు డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, తదితరులు పాల్గొన్నారు
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది