అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు క్రమ పద్ధతిలో కనిపించాలి… జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్

ప్రచురణార్థం

అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు క్రమ పద్ధతిలో కనిపించాలి…

మహబూబాబాద్ జూలై-28:

అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు క్రమ పద్ధతిలో కనిపించకపోయినా ట్రీ గార్డ్స్ లేకపోయినా నిధులు చెల్లించడం జరగదని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్పష్టం చేశారు.

బుధవారం మున్సిపల్ పరిధిలోని శనగ పురం వద్ద అవెన్యూ ప్లాంటేషన్ కలెక్టర్ పర్యవేక్షించారు.

అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు ట్రీ గార్డ్స్ మాత్రమే ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

మొక్కలు నాటేటప్పుడు కూడా నిటారుగా కనిపించేందుకు సపోర్ట్ గా కర్ర ను పాతాలని, దాని చుట్టూ ఒక మీటర్ వ్యాసార్థం గల నాణ్యమైన ట్రీ గార్డ్ ను ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా మొక్కలన్నీ క్రమపద్ధతిలో నాటాలని ట్రీ గార్డ్స్ వివిధ రంగులలో ఏర్పాటు చేస్తే అందంగా కనిపిస్తాయి అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి ఎంపీడీవో రవిందర్ డి ఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు
————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post