అవెన్యూ ప్లాంటేషన్ లో నాటే మొక్కలు మూడు అడుగులు తప్పక ఉండాలి… జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ప్రచురణార్థం

అవెన్యూ ప్లాంటేషన్ లో నాటే మొక్కలు మూడు అడుగులు తప్పక ఉండాలి…

నెల్లికుదురు
మహబూబాబాద్ జూలై 16:
అవెన్యూ ప్లాంటేషన్ లో నాటే మొక్కలు తప్పనిసరిగా మూడు అడుగులు ఉండాలని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ తెలిపారు.

శుక్రవారం నెల్లికుదురు మండలం సంధ్యతండా వద్ద అవెన్యూ ప్లాంటేషన్ ను కలెక్టర్ పరిశీలించారు.

నర్సరీ లోని మూడు అడుగుల ఎత్తు గల మొక్కలను తెచ్చి అవెన్యూ ప్లాంటేషన్ లో నాటాలి అన్నారు.

మొక్కలు నాటేటప్పుడే ఫెన్సింగ్ తప్పనిసరిగా చేయాలన్నారు.

భవిష్యత్తులో రహదార్ల విస్తరణ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నందున మొక్కలు వీలైనంత దూరంగా నాటాలన్నారు. ఎత్తుగా ఎదిగి మొక్కలను విద్యుత్ లైన్ల క్రింద నాటరాదన్నారు. మొక్కలు నాటేటప్పుడు ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్ మండల ప్రత్యేక అధికారి బాలరాజు తాసిల్దార్ రాఘవరెడ్డి ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ఏ పీ ఓ హేమంత్ ఈ జి ఎస్ ఈ సి హారిక గ్రామ సర్పంచ్ యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post