అసంగాటిత కార్మికులందరిని e-shram పోర్టల్ లో నమోదు చేసి వారికీ సామాజిక బద్ర్రత తో పాటు వివిధ సంక్షేమ పతకాలను అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.

ప్రకటన                                                         తేది: 07-12-2021

అసంగాటిత కార్మికులందరిని  e-shram పోర్టల్ లో నమోదు చేసి వారికీ సామాజిక బద్ర్రత  తో పాటు  వివిధ సంక్షేమ పతకాలను అందించడం జరుగుతుందని  జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.

శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లాకార్మిక శాఖ  మరియు మున్సిపల్ కమీషనర్లు, ఎం పి డి ఓ లు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ  భారత ప్రభుత్వం సామాజిక భద్రత పథకం కింద అసంఘటిత కార్మికుల కోసం e-shram పోర్టల్ ను ప్రవేశ పెట్టిందని, e-shram పోర్టల్ లో  ఈ.ఎస్.ఐ సౌకర్యం లేని అసంఘటిత కార్మికులు ప్రోవిడెంట్ ఫండ్ విభాగం లో ఎలాంటి రుసుము లేకుండా కామన్ సర్వీస్ సెంటర్ లో నమోదు చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పనులు చేసే వారు, మత్స్యకారులు, వీధి వ్యాపారాలు చేసే వారంతా అసంఘటిత కార్మికుల జాబితా లోకి వస్తారని తెలిపారు.  నమోదు చేసుకున్న తరవాత కార్డు తీసుకున్న కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారి కుటుంబం 2 లక్షలు ఆర్ధిక సహయాన్ని పొందుతారని, పాక్షికంగా అంగవైకల్యం కలిగితే ఒక లక్ష ఆర్ధిక సహాయాన్ని పొందుతారని తెలిపారు.  ప్రతి మండలం లో కార్మికుల వివరాలను సేకరించి  పోర్టల్ లో నమోదు చేయించాలని తెలిపారు. వడ్డేపల్లి, అయిజ గద్వాల్ మున్సిపాలిటిలలో ఈ పోర్టల్ కొరకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ను నియమించి  ప్రతి కార్మికుడిని e- shram  పోర్టల్ లో నమోదు చేసి ,కార్మికుల పూర్తి వివారాలను పొందు పరచేలా చూడాలని మున్సిపల్ కమీషనర్ లకు ఆదేశించారు. ఎన్ ఆర్ ఇ జి వర్కర్ లు, ఆశ వర్కర్లు, ఎస్ ఎచ్ జి స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడి లు, మధ్యాహ్నం భోజన  వర్కర్లు, విద్య వాలంటీర్లు,  అందరు  ఆదార్ నెంబర్ తో  అనుసందానమైన మొబైల్ నెంబర్  తో రిజిస్ట్రేషన్  చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

సహాయ కార్మిక శాఖ అధికారి మహేష్ కుమార్ మాట్లాడుతూ అసంగిటిత  కార్మికులందరూ  కేంద్ర ప్రభుత్వం  యొక్క వివిధ సంక్షేమ పథకాలను పొందుటకు  e –shram  పోర్టల్ లో ప్రతి కార్మికుడు నమోదు చేసుకోవాలని కోరారు.

 

సమావేశం లో  డి ఆర్ డి ఓ ఉమాదేవి,జాడ్పి సి ఇ ఓ విజయనయాక్,  మహిళా శిశు సంక్షేమ అధికారి ముషాయిధా బేగం , మున్సిపల్ కమీషనర్లు సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

———————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి చే  జారీ చేయడమైనది.

 

Share This Post