అసంఘటిత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న అన్ని రకాల భీమా పాలసీలు లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు

అసంఘటిత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న అన్ని రకాల భీమా పాలసీలు లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కార్మిక శాఖ  అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అమలు కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పని చేస్తున్న అసంఘటిత కార్మికులు అనగా  వలస కులీలు, తాపీ కార్మికులు, ప్లంబర్లు, ఎలాక్ట్రిషన్లు, వ్యవసాయ కూలీలు, ఉపాధిహామీ కులీలు, మత్స్యకారులు, ఆటో రిక్షా డ్రైవర్లు, వీధి వ్యాపారులు,  అంగన్వాడీ వర్కర్లు వంటి అన్ని రకాల కులీలు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి వంటి భీమా పాలసిలతో పాటు ఉచితంగా ఈ-శ్రమ్ భీమా పాలసీని అందిస్తున్నట్లు తెలిపారు.  ఇశ్రామ్ పాలసీని ప్రతి ఒక్కరికి అందించేందుకు జిల్లాలో 412 సి.ఎస్.సి కేంద్రాలను నియమించి వి.ఎల్.ఏ ల ద్వారా ఉచితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇశ్రామ్ భీమాను అందజేయడం జరుగుతుందన్నారు.  అందరు మండల అభివృద్ధి ఆధికారులు తమ మండలంలోని సి.ఎస్.సి కేంద్రాలకు సహకారం అందించి అర్హులందరికీ  వంద శాతం భీమా అందేవిధంగా చూడాలని ఆదేశించారు.  అదేవిధంగా ఆయా శాఖలలో పని చేస్తున్న కార్మికులు అంగన్వాడీ, ఆశాలు, ఉపాధి హామీ కులీలు, పారిశుధ్య సిబ్బంది తదితరులు ప్రతి ఒక్కరికి ఇశ్రామ్ భీమా అందే విధంగా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖాధికారులు తీసుకోవాలని ఆదేశించారు.  అనంతరం ఇశ్రామ్ ప్రచార గోడ పత్రికను అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి విడుదల చేసారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మనుచౌదరి,   కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేష్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు,  ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post