*జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.వేణు తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్*
భారత ప్రభుత్వం సామాజిక భద్రత పథకం కింద అసంఘటిత కార్మికుల కోసం e-shram పోర్టల్ ను ప్రవేశ పెట్టిందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.చంద్ర శేఖర్ తెలిపారు.
శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా న్యాయ సేవ అధికార సంస్ధ కార్యదర్శి, జిల్లాకార్మిక శాఖ ఉప కమిషనర్ తో కలిసి మున్సిపల్ కమిషనర్ లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో, వివిధ రంగాలలో పని చేస్తున్న అసంఘటిత కార్మికుల సంఘాల నాయకుల తో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ ప్రతి ఒక అధికారి తమ పరిధి లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల కు అవగాహన కల్పించి ఒక పథకం కింద కాకుండా సామాజిక బాధ్యత గా అర్హులైన వారిని చేర్పించాలని కోరారు. e-shram పోర్టల్ లో ఈ.ఎస్.ఐ సౌకర్యం లేని అసంఘటిత కార్మికులు,ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్,ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ సౌకర్యం లేని వారు,16-59 సం. ల వయస్సు లోపు వారు, ఆదాయ పన్ను చెల్లించని వారు ఈ పథకం లో చేరడానికి అర్హులు అని అన్నారు.ఇందులో చేరిన ప్రతి అసంఘటిత కార్మికుడికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు (UAN) ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఈ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలు,వివిధ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని అన్నారు.ఇందులో చేరిన ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధాన మంత్రి సంరక్ష భీమా యోజన క్రింద 2 లక్ష ల ప్రమాద మరణం/అంగ వైకల్య భీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అసంఘటిత కార్మికుల నుద్దేశించి చేసే పథకాలు విధానాల కు ఈ డేటా బేస్ ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని,వలస కార్మికులు ఎక్కడ ఉన్నా రో గుర్తించి వారికి ఉపాధి కల్పించడం జరుగుతుందని అన్నారు. నమోదుకు ఎలాంటి రుసుము లేకుండా కామన్ సర్వీస్ సెంటర్ లో నమోదు చేసుకోవాలని అన్నారు.వ్యవసాయ,అనుబంధ ఉపాధుల వారు, ఉపాధి హామీ పనులు చేసే వారు, మత్స్యకారులు,సేవారంగం పని వారు,చేతి వృత్తుల పనివారు,అటో మొబైల్ రంగం,డ్రైవర్ లు,హెల్పర్ లు,కల్లు గీత,కళాకారులు,రిక్షా కార్మికులు,బీడీ కార్మికులు, చెత్త ఏ రే వారు,తోపుడు బండి వ్యాపారస్తులు, ఇంటి వద్దవస్తువులు తయారీ, వీధి వ్యాపారాలు చేసే వారంతా అసంఘటిత కార్మికుల జాబితా లోకి వస్తారని తెలిపారు.
సమావేశం లో జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి జి.వేణు,కార్మిక శాఖ ఉప కమిషనర్ రాజేంద్ర ప్రసాద్, సంబంధిత అధికారులు, అసంఘటిత కార్మికుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


