అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికుల వివరాలను ఈ-స్రామ్ లో నమోదు చేయించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం..3 తేదిః 22-11-2021
అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికుల వివరాలను ఈ-స్రామ్ లో నమోదు చేయించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, నవంబర్ 22:
జిల్లాలో అసంఘటిత రంగాలలో (అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్) పనిచేసే వారి వివరాలను గుర్తించి వారి వివరాలను ఇస్రామ్ ఫోర్టల్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. ఈ సందర్బంగా సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంనుండి జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కన్వర్జేన్సీ మరియు మున్సిపల్ పట్టణ ప్రగతి పనులపై మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఇస్రామ్ ఫోర్టల్లో అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికుల పేర్లను నమోదు చేయించడాన్ని డ్రైవ్ గా నిర్వహించాలని, పేర్లను ఎందుకు సేకరిస్తున్నారన్న సమాచారాన్ని కార్మికులకు తెలపడంతో పాటు, లబ్దిచేకూరే అంశాలపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ పంచాయితి నుండి జిల్లా వరకు ప్రత్యేక అధికారుల వారిగా అన్ ఆర్గనైజ్డ సెక్టార్ లో పనిచేసే కార్మికుల వివరాల జాబితాను రూపొందించాలని, ఫోర్టల్ వారి పేరును నమోదు చేయడంలో అధికారులు డ్రైవ్ లా చేపట్టాలని పేర్కోన్నారు.
ఈరోజు దాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీలో, వాహనాల ద్వారా దాన్యం దిగుమతిలో అలస్యం జరుగుతుందని గుర్తించడం జరిగిందని, అధికారులు దృష్టి సారించి కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు లారీల ద్వారా తరలించిన దాన్యం దిగుమతిలో అలస్యంగాకుండా ఎన్ ఫోర్స్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరగా అన్ లోడ్ చేయించాలని అన్నారు. నాణ్యత ప్రమాణాలను వ్యవసాయశాఖ అధికారులు దృవీకరించాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారులు కోనుగోలు ముగిసే వరకు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
వ్యాక్సినేషన్ ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయని గుర్తించడం జరిగిందని అ విధంగా జరగకుండా అధికారులు దృష్టి సారించాలని, ప్రభుత్వ కార్యాలయాలలో ప్రిపెయిండ్ విద్యూత్ మీటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వారు ఎప్పటికప్పడు రిచార్జ్ చేసుకునేలా చూసుకోవాలని సూచించారు. ఎమ్మేల్సి ఎన్నికల కోడ్ దృశ్యా తాత్కాళికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించ లేకపోతున్నందున, కోడ్ ముగిసి తిరిగి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించే వరకు అధికారులు ఉధయం కార్యాలయంలో అందుబాటులో ఉండి సమస్యలపై వచ్చే ధరఖాస్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల డిడిఓ ల నుండి ఇంక్రిమెంట్లు, సిబ్బందికి చెల్లించాల్సిన ఇతర డ్యూలకు సంబంధించి నివేధికను తీసుకోవాల్సిందిగా కలెక్టర్ కార్యాలయ ఏఓ ను ఆదేశించారు. సిబ్బందికి చెల్లింపులలో అలస్యం జరగకుండా చూడాలని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవని ఎన్రోల్ కాని వారిని గుర్తించి వారిక వ్యాక్సిన్ ఇప్పించేలా చూడడం జరుగుతుందని, సమస్యలపై వెంటనే దృష్టికి తీసుకురావాలని పేర్కోన్నారు.
ప్రతి 3వ శనివారం అన్ని కార్యాలయాలను శుభ్రం చేసుకునే కార్యక్రమాలను చేపట్టాలని, అనివార్యకారణాల వలన శుభ్రం చేయించలేనట్లయితే తదుపరి వారం శుభ్రం చేయించాలని ఆదేశించారు. హరితహారం, లేబర్ టర్నవుట్ సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
పట్టణప్రగతి పనులు బడ్జెట్ వినియోగం, ప్రతినెల నిధులు సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులు యం.బి రికార్డులు సక్రమంగా, సకాలంలో నిర్వహించి చెల్లింపులు తోరగా జరిగే విదంగా చూడాలని, హరితహారం గ్రీన్ బడ్జెట్ లో కేటాయించిన నిధుల ద్వారా నిర్వహించే నర్సరీలు సక్రమంగా నిర్వహించాలని, పట్టణ ప్రగతి కార్యక్రమం పనులు త్వరితగతిన జరిగేలా చూడాలని ఆదేశించారు.పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, పరిశుభ్రం పై ఎక్కువ దృష్టి పెట్టాలని, ప్రతి రోజు ఉదయం వార్డుల్లో పర్యటించి సమస్యలు పరిష్కారం చేయాలని, మున్సిపల్ వాహనాల రిజిస్ట్రేషన్ కానీ వాటికి వెంటనే రిజిస్ట్రేషన్, రెగ్యులర్ గా ఇన్సూరెన్స్ చేసి వాటిలో జి.పి.ఎస్. సిస్టమ్స్ ఏర్పాట్లు చేయాలని తెలియచేసారు.

అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికుల వివరాలను ఈ-స్రామ్ లో నమోదు చేయించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post