అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్ లో వారి పేర్లను అధికారులు నమోదు చేయించాలి.. అదనపు కలెక్టర్ చంద్రయ్య.

జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులందరిని e-SHRAM (ఈ-శ్రమ్) పోర్టల్ నందు వారి పేర్లు నమోదు చేసి వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలియజేసినారు.
ఈరోజు స్థానిక DPRC భావనములో జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అసంఘటీత రంగ కార్మికులకు ఉచిత సభ్యత్వం నమోదు పథకం క్రింద జిల్లాలో గల 1.50 లక్షల మంది కార్మికులను పోర్టల్ లో నమోదు చేయించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలు, జాబ్ కార్డు ఉన్న అందరు ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, ఆశా వర్కర్లను వెంటనే నమోదు చేపియ్యాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో అధికారులు కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు.
అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పధకాలను అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు 26 న ఈ-శ్రమ్ ద్వారా ఉచిత నమోదు ప్రక్రిమ చేపట్టిందని అన్నారు.
ఈ-శ్రమ్ పోర్టల్ లో పేర్ల నమోదు కోసం ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ లతో అన్ని మున్సిపాలిటీలలో గ్రామ పంచాయితీలలో కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లు మీ-సేవ కేంద్రాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఆ వెంటనే యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబరు (UAN) గల ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇట్టి అవకాశం డిసెంబర్,31 వరకు కల్పించడం జరిగిందని తెలిపారు.
ఇందులో పేరు నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన క్రింద 2 లక్షల ప్రమాద భీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని తెలిపారు. 16 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న భావన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, రిక్షా తొక్కే వారు, ఇండ్లలో పనిచేసే వారు, మత్స్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, తోపుడు బండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, పారిశుధ్య కార్మికులు, బీడీ కార్మికులు
ప్రతి కార్మికుడు అర్హులన్నారు.
వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరు భాగస్వాములై అసంఘటిత రంగ కార్మికులందరు పేర్లు నమోదు చేసుకునేలా అవగాహన కలిగించి ప్రోత్సహించాలని చంద్రయ్య కోరారు. ఈ.పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ. ఆదాయపు పన్ను చెల్లించే వారు అర్హులు కారని ఈ సందర్బంగా తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు లేబర్ శాఖ శ్రీనివాస్ రావు, యస్సి, యస్టి, బిసి సంక్షేమ శాఖల అధికారులు మల్లేశం, కోటాజి, పుష్పలత, DWO లలిత కుమారి, మత్స్యశాఖ అధికారి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post