అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసమే ఈ-(శమ్‌ పోర్టల్‌ ఏర్పాటు : జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌

అసంఘటిత రంగాలలో పని చేయుచున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ-శ్రమ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల క్రింద పని చేయుచున్న అసంఘటిత కార్మికులు వారి వివరాలను ఈ-(శమ్‌లో నమోదు చేసుకునేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు వారి క్షేత్ర స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తూ ప్రాధాన్యత పరంగా నమోదు చేయించడంతో పాటు ప్రతి నెల సమీక్షించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో చేరేందుకు అసంఘటిత రంగ కార్మికులు వారి సమీపంలోని కామన్‌ సదీళు సెంటర్ల ద్వారా ఉచితంగా రిజిస్టేషన్‌ చేసుకోవచ్చని, వ్యవసాయ, అనుబంధ ఉపాధి వర్షాలు, భవన, అనుబంధ రంగాల వర్షాలు, మత్స్యకారులు, ఆటో దైవర్హు, చేనేత కార్మికులు, వడ్రంగులు, ఇటుక బట్టీలు, క్వారీ, మ్‌ల్పు, కార్మికులు, వార్తాపత్రిక విక్రేతలు, ఆశ వర్శర్తు, మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, రిక్షా కార్మికులు, చిన్న సన్నకారు రైతులు, కూరగాయలు, పండ్ల విక్రేతలు, అన్ని రకాల దినసరి కూలీలు వారి వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 16 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు, ఈ.పి. ఎఫ్‌., ఈ. ఎస్‌.ఐ. సదుపాయం లేని వారు, ఆదాయ పన్ను చెల్లించని వారి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ పథకంలో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఏడాది పాటు ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన క్రింద 2 లక్షల రూపాయల ప్రమాద భీమా పథకం, అంగవైకల్య భీమా పథకం వర్తిస్తాయని, వివరాలు నమోదు పూర్తి అయిన వారికి 12 అంకెలు గల యూనివర్సల్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ కార్డును మంజూరు చేస్తారని, ఈ వివరాలను ప్రామాణికంగా తీసుకుంటారని, ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలకు ఈ కార్జ్డును వర్తింపజేస్తారని తెలిపారు. ఈ పధకంలో నమోదు చేసుకునేందుకు అభ్యర్థి ఆధార్‌ కార్డు, మొబైల్‌ నెంబర్‌తో అనుసంధానం కలిగిన బ్యాంక్‌ ఖాతా పుస్తకం జిరాక్స్‌ను తీసుకొని సమీపంలోని కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ను సంప్రదించి ఉచితంగా తక్షణమే ఈ-శ్రమ్‌ కార్డును పొందవచ్చునని తెలిపారు. అర్హత గల అసంఘటిత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్మిక కమీషనర్‌ మహ్మద్‌ రఫి, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమీషనర్హు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది

Share This Post