అసంఘటిత ,వలస కార్మికులు, చిరు వ్యాపారులు తప్పనిసరిగా ఈశ్రం భీమ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు

మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అసంఘటిత, వలస కార్మికులకు, చిరు వ్యాపారులకు వ్యాక్సినేషన్, ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసోసియేషన్ల ప్రతినిధులు కూలీలకు తప్పనిసరిగా ఈశ్రం రిజిస్ట్రేషన్ సి ఎస్ సి సెంటర్ ల ద్వారా చేయించాలని కోరారు. ఈ ఎస్ ఐ, పిఎఫ్ లేనివారు ఈ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కరోనా రాకుండా కార్మికులందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకునే విధంగా చూడాలని కోరారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ , ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ హిందూ ప్రియా, కమిషనర్ దేవేందర్, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.

Share This Post