అస్వస్థతకు గురై జిల్లా ఏరియా అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాల బాలికలను పరామర్శించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్ధం

మహబూబాబాద్, మార్చ్ – 16:

మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, సిరోలు గ్రామంలో ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో కల్తీ ఆహారం తిని, నిన్న అస్వస్థతకు గురై మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రిలో చేరిన విద్యార్థినులను నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి జిల్లా ఏరియా హాస్పిటల్ కి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్య అధికారులు తెలిపారు.
———————————————————————————————————

Share This Post