slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

ఆకర్షణీయ వరంగల్ మహా నగరంలోని 5 సం.లోపు చిన్నారుల వికాసమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు. – Information and Public Relations Department, Government of Telangana

ఆకర్షణీయ వరంగల్ మహా నగరంలోని 5 సం.లోపు చిన్నారుల వికాసమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు.

ఆకర్షణీయ వరంగల్ మహా నగరంలోని 5 సం.లోపు చిన్నారుల వికాసమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు.

*ఐదెండ్ల లోపు చిన్నారుల వికాసమే లక్ష్యం:బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి*

● _నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ పట్టణ స్థాయి వర్క్ షాప్ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్,కమిషనర్.

*GWMC,30 నవంబర్ 2022:*

ఆకర్షణీయ వరంగల్ మహా నగరంలోని 5 సం.లోపు చిన్నారుల వికాసమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు.

బుధవారం హన్మకొండ లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ వరల్డ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ ,బల్దియా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ పట్టణ స్థాయి కార్యశాల (వర్క్ షాప్) కార్యక్రమం లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు,జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య లతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశానికి మేయర్ ముఖ్య అతిధి గా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్ఠికాహారాన్ని అందజేస్తున్నారని, 0-5 సం.పిల్లల అవసరాలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసి అమలు చేయడం జరుగుతుందని అన్నారు. వార్షిక బడ్జెట్ లో 10% పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి కేటాయిస్తున్నామని,మహా నగర వ్యాప్తం గా నోటి ఫైడ్ , నాన్- నోటి ఫైడ్ స్లం ప్రాంతాలు ఉన్నాయని, కార్పొరేటర్ లు, ప్రజల ను భాగస్వామ్యం చేస్తూ ఆ ప్రాంతాల్లో గల ఖాళీ ప్రాంతాలను గుర్తించి చిన్నారుల కొరకు పార్కులను అభివృద్ధి చేస్తామని తెలిపారు.పిల్లలే మన భవిష్యత్తని, వారి అభివృద్ధికి మొదటి 5 సంవత్సరాలు అత్యంత కీలకం మరియు వారి ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు అనుకూలంగా ఉండే వివిధ ప్రాజెక్టుల ద్వారా బల్దియా అనేక రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

శిశువులు, పసిబిడ్డలు మరియు సంరక్షకులకు స్నేహపూర్వకంగా మార్చడానికి దేశవ్యాప్తంగా మొదటి 10 నగరాల్లో మన నగరం నిలిచిందన్నారు.

దేశవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ నగరాలు పాల్గొన్న పోటీల్లో నగర పరిధి లోగల 13 వ డివిజన్ లోని MH నగర్‌లో చిట్టి పార్క్‌ను 56 గంటల్లోనే పూర్తి చేసినందుకు గాను ప్లేస్‌మేకింగ్ మారథాన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ ( MOHUA ) ద్వారా బల్దియా కు అవార్డు లభించిందని తెలుపడానికి సంతోషిస్తున్నామని అన్నారు. ఇటీవల, అంతర్జాతీయ స్థాయిలో రియల్ ప్లే ఛాలెంజ్ కింద ‘ఛాలెంజ్ -1వ దశలో మా స్థిరమైన ప్రయత్నాల కోసం *అన్ని వర్గాలను ప్లే చేసే ప్లేసెస్* అవార్డును కూడా అందుకోవడం జరిగిందని చెప్పారు.

వాతావరణ మార్పుల పట్ల నగరం యొక్క సమతుల్యత పెంపొందించే విధంగా వరంగల్ నగరాన్ని పట్టణ పచ్చదనం కోసం కూడా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. పబ్లిక్ స్పేసెస్ లు నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరుతున్నమన్నారు.

*హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్‌లో చురుకుగా పాల్గొని నగరంలో రాబోయే ప్రాజెక్ట్‌ల రూపకల్పన మరియు అమలులో సహకరించాలని అన్నారు. పట్టణ ప్రణాళికా విభాగం,ట్రాఫిక్,కుడా మరియు ఇంజనీరింగ్ అధికారులకు అత్యంత ఉపయుక్తమైన కార్యక్రమం అని సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా గల లే అవుట్ స్థలాల్లో, 28 యు హెచ్ సి లలోని ఖాళీ స్థలాల్లో పిల్లల కొరకు పార్క్ లను అభివృద్ధి చేయాలని తెలిపారు.

*జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ* వరంగల్ మహానగర వ్యాప్తంగా పిల్లల స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 5 సం.లోపు పిల్లలకు సదుపాయాల కల్పనకు జిడబ్ల్యూ ఎంసీ డబ్ల్యు.ఆర్. ఐ తో ఒప్పందం చేసుకొని ఎం.ఓ.హెచ్.యు.ఏ .మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని అన్నారు. నర్స్హరింగ్ నెబర్హుడ్ ఛాలెంజ్ లో

ఫెజ్- 1 ప్రాజెక్ట్ లో భాగం గా 7 పనులైన జంతువుల కోసం హన్మకొండ లో పెట్ పార్కును ఏర్పాటు , అంగన్వాడీ కేంద్రం నవీకరణ, వాల్ పెయింటింగ్ తో పాటు అంగన్వాడి నుండి బస్టాండ్ జంక్షన్ వరకు కనెక్టింగ్ రోడ్డు ఏర్పాటు చేశామని తెలిపారు. రెండవ దశలో 14 ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. అందులో ఎంహెచ్ నగర్ లోని చిట్టి పార్కు, క్రిస్టియన్ కాలనీ పార్కు, శ్రీనగర్ కాలనీ పార్కు, గుండు భావి పార్కును ఏర్పాటు చేశామని, సుభాష్ నగర్ పార్కు ఎఫ్.సి.ఐ కాలనీ పార్కు , ప్రభుత్వ ప్రాక్టిసింగ్ పాఠశాల ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని, త్వరలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్, టిఆర్టి కాలనీ పార్కు పుప్పాలగుట్ట పార్కు, మార్కజి జంక్షన్, వీధుల అభివృద్ధి, భద్రకాళి లేక్ బండ్, సెంట్రల్ లైబ్రరీ పనులు చేపడతామని అన్నారు.

ఈ వర్క్ షాప్ లో నార్చరింగ్ నెబారహుడ్ చాలంజ్ కు సమ్బంధించిన పలు అంశాలపై నిపుణులు డబ్ల్యూ ఆర్ ఐ ప్రతినిధులు స్వాతి, ప్రోగ్రాం మేనేజర్ లు అచ్చు శేఖర్, కౌతుబ్ చుకె, సీనియర్ మేనేజర్ సూర్య ప్రకాష్,మధుర కులకర్ణి, కుమారస్వామి, సి హెచ్ ఓ శ్రీనివాస్ రావు వివరించారు.

ఈ వర్క్ షాప్ లో ,

బల్దియా, హర్టీ కల్చర్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖ, అటవీ శాఖ, కుడా,ట్రాఫిక్ పోలీస్ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.                             

Share This Post