ఆకాంక్ష నివేదికలు అప్లోడ్ చేయుటలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు విద్య, వైద్య, మహిళా శిశు సంక్షేమ, రహాదారు లు, భవనాల శాఖ, డిఆర్డిఓ, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్ధక, మార్కెటింగ్,  అధికారులతో యాస్పిరేషనల్  అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 10వ తేదీ వరకు యాస్పిరేషనల్ నివేదికలు అందచేయాలని ఆదేశించారు. యాస్పిరేషన్ పోర్టల్ లో డాటా ఎంట్రీ సక్రమంగా జరగడం లేదని, ప్రతి నెలా అప్లోడ్ చేస్తున్న ఇండికేటర్లు సమగ్ర పరిశీలన తదుపరి మాత్రమే అప్లోడ్ చేయాలని అధికారుల ను ఆదేశించారు.  నివేదికల్లో వ్యత్యాసం రాకుండా అధికారులు నిషిత పరిశీలన చేసిన తదుపరి మాత్రమే అప్లోడ్ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల నివేదికలు ద్వారా మాత్రమే జిల్లా యొక్క ర్యాంకింగ్స్ పెరుగుతాయని చెప్పారు. గిరిజనులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, విద్య, వైద్య రంగాల్లో వెనుకంజలో ఉన్న జిల్లాలను అబివృద్ది చేసేందుకు మన జిల్లాను యాస్పిరేషనల్  ప్రకటించినట్లు చెప్పారు.  దేశవ్యాప్తంగా ఉన్న 726 జిల్లాలకు గాను 112 జిల్లాలను మాత్రమే  ఆకాంక్షిత జిల్లాలుగా నీతి అయోగ్ ప్రకటించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో విద్య, వైద్య, అంగన్వాడీ, ఉపాధి హామీ పథకం పనులు వినియోగం ద్వారా నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలోని 479 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 329 గ్రామ పంచాయతీల్లో కామన్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన గ్రామ పంచాయతీల్లోను అక్టోబర్ 25వ తేదీ నాటికి కామన్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేసి నివేదికలు అందచేయాలని చెప్పారు. కామన్ సర్వీస్ కేంద్రాల ద్వారా ప్రజలకు పాస్ పోర్టు సేవలు, ఆధార్ కార్డులు, టెలి మెడిసిన్ సేవలు,  టెలి లా వంటి సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. పంటరుణాలు మంజూరుపై మండలాల వారిగా నివేదికలు అందచేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జారీ చేయబడిన 2400 సాయిల్ హెల్త్ కార్డులు జారీపై నివేదికలు అందచేయాలని చెప్పారు. పశువులను వ్యాధుల బారి నుండి రక్షించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని పశుసంవర్ధక ఏడిని ఆదేశించారు. డ్రాపవట్లు లేకుండా విద్యార్థుల ఎన్రోల్మెంట్ ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని బాలికల పాఠశాలల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ఫోటోలు అందచేయాలన్నారు. చదువుల్లో వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని చెప్పారు. పేరెంట్స్ తో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. రీడింగ్, రైటింగ్, లెక్కలపై ప్రత్యేక ఫోకస్ చేయాలన్నారు. యంఈఓలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలకు మిషన్ బగీరథ మంచినీరు సరఫరా చేయాలని, సెప్టెంబర్ 1వ తేదీ నాటికి అన్ని పాఠశాలల్లో మంచినీరు సరఫరా చేయాలని ఆదేశించినప్పటికీ ఇంకనూ 45 పాఠశాలలకు ఎందుకు కనెక్షన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో అన్ని పాఠశాలలకు మంచినీటి సరఫరా చేసి నివేదికలు అందచేయాలని, అలా చేయని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పి హెచ్ సి వారిగా ఏ ఎన్ సి చెకప్స్ నివేదికలు అందచేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఎఎన్సీ పరీక్షలు క్రమం తప్పక చేయడవ వల్ల మాతా శిశు మరణాలను అరికట్టగలమని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్ఓ అశోకచక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, సంక్షేమ అధికారి వరలక్ష్మి, వైద్యాధికారి శిరీష, ర.భ. ఈఈ భీమ్లా, ఎల్డీయం శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, ఇరిగేషన్ అధికారి అర్జున్, సహాకార అధికారి వెంకటేశ్వర్లు, సిపిఓ యుఎస్ రావు, పశుసంవర్ధక శాఖ ఏడి పురందర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Share This Post