ఆక్సిజన్ ప్లాంట్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

ఆక్సిజన్ ప్లాంట్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి…

మహబూబాబాద్ ఆగస్టు-23:

ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

సోమవారం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద రామ మందిరం ప్రక్కనే నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులు కలెక్టర్ సందర్శించి పరిశీలించారు పనులను వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు అనంతరం ఏ ఏరియా హాస్పిటల్ ను సందర్శించారు.

హాస్పిటల్ లో ఏర్పాటు చేయనున్న నూతన జనరేటర్ లను పరిశీలించారు. హాస్పిటల్ ముఖద్వారం పరిశుభ్రంగా ఉంచాలని రంగులు వేయించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కోఆర్డినేటర్ వెంకట్ రాములు టీఎస్ ఎం ఎస్ ఐ డి సి ఈ ఈ ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post