ఆగస్టు నెల 15 కిలోల రేషన్‌ బియ్యం సిద్ధం లబ్ధిదారులు తీసుకువెళ్లాలి – అదనపు కలెక్టర్ మోతిలాల్

ఆగస్టు నెలలకు సంబంధించి రేషన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి 15 కిలోల చొప్పున ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేసే 1 రూపాయికి కిలో బియ్యాన్ని వెంటనే కొనుగోలు చేసుకోవాలని అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ శుక్రవారం ఒక ప్రకటనలు కోరారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని 2,38000 తెల్ల రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనున్న 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలోని 558 రేషన్ దుకాణాలలో సిద్ధంగా ఉందని రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులంతా ఆగస్టు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి తీసుకువెళ్లాలని ఆయన కోరారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులంతా తమకు సంబంధిత రేషన్ దుకాణాలను సందర్శించి ఆగస్టు నెలకు సంబంధించిన బియ్యాన్ని తీసుకువెళ్లాలని, రేషన్ దుకాణదారులు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, అట్టి రేషన్ దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం మన జిల్లాలో పండిన బియ్యమేనని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

Share This Post