ఆగస్టు 15న స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించబడే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పకడ్బంది ఏర్పాట్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు

Press release. 13.8.2021.

ఆగస్టు 15న స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించబడే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పకడ్బంది ఏర్పాట్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నాడు ఆయన తన చాంబర్లో ఏర్పాట్లను సమీక్షిస్తూ, జిల్లా కేంద్రం లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. వేడుకలో కోవిద్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రస్పుటించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో అన్ని కార్యాలయాల సిబ్బంది విధిగా హాజరు కావాలని, అందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే‌, కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.శీను, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా ఉద్యాన అధికారి సంజీవ రావు, ఎపీడి సాయన్న‌, కలెక్టరేట్ పరిపాలనాధికారి రవీందర్, అధికారులు పాల్గొన్నారు.

….DPRO. KMR

Share This Post