ఆగస్టు 15 న కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమ సింగ్ లతో కలిసి మైదానాన్ని పరిశీలించారు

ఆగస్టు 15 న కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమ సింగ్ లతో కలిసి మైదానాన్ని పరిశీలించారు

ఆగస్టు 15 న కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమ సింగ్ లతో కలిసి మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వచ్చే అతిధులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, షామియానాలు, కుర్చీలు, మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా బ్యారికేడింగ్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. డి.ఆర్.డి.ఓ., వ్యవసాయ,ఉద్యాన, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్ల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నందున వేదికను వివిధ రంగుల పూలతో ఆకర్షణీయంగా అలంకరించాలని అన్నారు. పాఠశాల విద్యార్థిని,విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విశిష్ట సేవలందిస్తున్న ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇవ్వనున్నామన్నారు. ఈ సందర్భంగా మైదానాన్ని కలియ తిరిగి వేదిక, స్టాల్ల్స్ ఏర్పాటు ప్రాంతాలను, స్వాతంత్య్ర సమరయోధులు, మీడీయా , అవార్డు గ్రహీతలు కూర్చునే ప్రాంతాలను పరిశీలించి పగడ్బందీగా ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.ఏం.అండ్ హెచ్.ఓ. వెంకటేశ్వర్ రావు, ఆర్.డి.ఓ. సాయి రామ్, డి .పి.ఆర్.ఓ. శాంతి కుమార్, తదితరులున్నారు.

Share This Post