ఆగస్టు 16న కవి సమ్మేళనం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
8.8.2022 .
వనపర్తి

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా ఆగస్టు 16న సాయంత్రం 6 గంటలకు నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయంలో కవి సమ్మేళనం, ముషాయిరాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కవులు 75 వసంతాల స్వతంత్ర భారతం అనే అంశంపై కవితలు వినిపించాల్సి ఉంటుందని తెలిపారు. కవి సమ్మేళనంలో పాల్గొనే జిల్లాకు చెందిన కవులు ఈనెల 14వ తేదీలోగా తమ వ్యక్తిగత వివరాలు, స్వీయ రచనలను ఈ క్రింది నంబర్లకు వాట్స్అప్ ద్వారా పంపాల్సిందిగా కలెక్టర్ కోరారు. మొబైల్ నంబర్స్ 9154 170 917, 9490 909 821, 9704 840 963 నంబర్లకు వాట్స్అప్ చేయాలని తెలిపారు.

…..

జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయబడినది.

Share This Post