ఆగస్టు 6 లోగా జాతీయ రహదారికి ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది 04.08.2021 ఆగస్టు 6 లోగా జాతీయ రహదారికి ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశ మందిరంలో హరితహారం పై సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలదేనని చెప్పారు. అటవీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేసి మొక్కలు నాటాలని సూచించారు. పెద్ద మొక్కలు నాటాలని కోరారు.గ్రామాల వారిగా మొక్కలు నాటిన వివరాలు రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మొక్కలు నాటిన తర్వాత అటవీ అధికారులు వాటిని గ్రామ పంచాయతీలకు అప్పగించాలని కోరారు. సమావేశంలో డిఎఫ్వో నిఖిత, డి పి ఓ సునంద, ఉపాధి హామీ ఏపిడి సాయన్న, అటవీశాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post