ఆగస్ట్ 15 నుండి అక్టోబర్ 15 వరకు కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాల గడువు : జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారిని నుశిత

పత్రికా ప్రకటన    తేది:12.08.2022, వనపర్తి.
      రాష్ట్ర ఆదేశాల మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి వివిధ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ, షెడ్యూల్డ్ కులాల అర్హత కలిగిన ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు, మెయింటెనెన్స్ ఛార్జీలు పొందుటకు ఈ నెల 15వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ గడువులోపల తమ వివరాలను ఈ – పాస్ వెబ్ సైట్ http://telanganaepass.cgg.gov.in యందు అప్ లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారిని నుశిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
       ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ, షెడ్యూల్డ్ కులాలకు చెందిన అర్హులైన కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్ లు తమ తమ కళాశాలల విద్యార్థులకు సమాచారం అందజేసి ఈ – పాస్ వెబ్ సైట్ లో ఆధార్ బయో మెట్రిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా ఆమె సూచించారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post