ఆగస్ట్ 2 న హాలియా లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి*

హాలియా, జులై 29 .నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా లో ఆగస్ట్ 2 న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రానున్నందున,ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి గురు వారం పరిశీలించారు
ప్రభుత్వ ఐ. టి.ఐ వద్ద హెలి పాడ్,నియోజకవర్గ ప్రగతి సమీక్ష నిర్వహించేందుకు సమావేశ నిర్వహణ కు ప్రభుత్వ ఐ. టి.ఐ., మార్కెట్ యార్డ్ ను స్థానిక శాసన సభ్యులు నోముల భగత్,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ.జి.ఏ.వి. రంగ నాథ్,అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాసన సభ ఉప ఎన్నిక సందర్భంగా చెప్పిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హాలియా కు విచ్చేసి ముఖ్యమంత్రి హామీ ల అమలు, నియోజక వర్గం ప్రగతి సమీక్ష నిర్వహిస్తారని అన్నారు.నియోజక వర్గం లో సమస్యలు,అభివృద్ధి కార్యక్రమాల అమలు,పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి,దీర్ఘకాలిక సమస్యలు పై వార్డ్ సభ్యులు,సర్పంచ్,ఎం.పి.టి.సి.,ఎం.పి.పి,జడ్.పి.టి.సి.లు,అధికారుల తో సమీక్షించి  సలహాలు,సూచనలు,దిశా నిర్దేశం చేస్తారని ఆయన అన్నారు.మంత్రి వెంట వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post