ఆఘాఖాన్ అకాడమీ లో సీట్లు సాధించిన ఏకలవ్య స్కూల్ విద్యార్థినులను అభినందించిన కలెక్టర్…

ప్రచురణార్ధం

ఆఘాఖాన్ అకాడమీ లో సీట్లు సాధించిన ఏకలవ్య స్కూల్ విద్యార్థినులను అభినందించిన కలెక్టర్…

మహబూబాబాద్, డిసెంబర్-22:

సీరోల్, బయ్యారం ఏకలవ్య స్కూల్స్ లో విద్య నభ్యసిస్తూ ఆఘాఖాన్ అకాడమీలో సీట్లు సాధించిన నిరుపేద విద్యార్థినులు దీక్షిత, నిహారికలను జిల్లా కలెక్టర్ శశాంక అభినందించారు.

వరంగల్ జిల్లా మట్టేవాడ కు చెందిన రౌతు దీక్షిత జిల్లాలోని సీరోల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యనభ్యసిస్తూ ఆఘాఖాన్ అకాడమీలో 6వ తరగతిలో సీటు సాధించడం పట్ల కలెక్టర్ అభినందించారు.

అలాగే కురవి మండలం అయ్యగారిపల్లికి చెందిన బాణోత్ నిహారిక బయ్యారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యనభ్యసిస్తూ ఆఘాఖాన్ అకాడమీలో సీటు సాధించడంతో కలెక్టర్ అభినందిస్తూ… దేశంలోనే అతి ఖరీదైన విద్య అందించే అకాడమీలో సీటు సాధించడం విద్యార్థుల ప్రతిభను చాటిందని, ఎంతో అదృష్ట మన్నారు. జీవితంలో ఎలాంటి వడిదోడుకులు వచ్చినా మనోధైర్యంతో ముందడుగు వేస్తూ ప్రణాళికతో విజయాలు సాధించాలన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థినులకు అండగా నిలబడాలని, నిరంతరం ప్రోత్సహిస్తూ విజయాలు సొంతం చేసుకునేలా కృషి చేయాలన్నారు. జిల్లా నుండి ఎటువంటి సహకారం కావాలన్న సంప్రదించాలని, జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ రీజినల్ కో ఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, బయ్యారం, సీరోల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ లు రవిబాబు, కె.అనిత విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
—————————————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం, మహబూబాబాద్ చే జారిచేయనైనది.

Share This Post