ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలి,కలెక్టరేట్ ఏఓ, వెంకటేశ్వర్లు

ఆచార్య  కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలి,కలెక్టరేట్ ఏఓ, వెంకటేశ్వర్లు

కొండా లక్ష్మణ్  జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్  సమావేశమందిరములో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో, స్వాతంత్ర్యోద్యమంలో, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నిఖార్సైన తెలంగాణా వాది కొండా లక్ష్మణ్ అని అన్నారు.

ఈ కార్యక్రమము లో , జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఝాన్సీ ,సి.పి.ఓ మోహన్ రావు, డీఈఓ ఎన్.ఎస్.ఎస్ ప్రసాద్, ఆయా శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share This Post