ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన 27 .9. 20 21 వనపర్తి
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అన్నారు.
సోమవారం రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్ లో కోండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ప్రస్తుత్త ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకెడి గ్రామంలో జన్మించారని, మూడేళ్ల వయస్సు లో తల్లి మరణించిందని, ఉర్దూ విద్యలో ప్రావీణ్యం సాధించి పోస్టల్ శాఖలో ఉద్యోగంలో చేరారని, 1931లో 20 మైళ్లు నడిచి గాంధీని కలుసుకోని స్వాతంత్రయ ఉద్యమంలో పాల్గోన్నారని ఆమె తెలిపారు. మెట్రిక్యులేషన్ పూర్తి చేసారని, హైదరాబాద్ లో 1940లో లా విద్యను పూర్తి చేసారని వివరించారు.
అనంతరం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలోని క్వీట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గోన్నారని అన్నారు. నిజాం రజాకార్లు చేస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా పొరాటం చేసారని,నగర పౌర హక్కుల కోసం ఉద్యమించారని, వాటి సాధనకు కమీటిలు ఏర్పాటు చేసారని, మొట్టమొదటి సారిగా 1952లో ఆయన ఆసిఫాబాద్ శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు, అప్పుడు జరిగిన నాన్ ముల్కి ఉద్యమంలో చురుకుగా పాల్గోన్నారని, 1957-60 మధ్య డిప్యూటి స్పీకర్ గా పని చేసారని, ఆయన రెండు సార్లు మంత్రి పదవిని అలంకరీంచారు,మొత్తం 17 ఏళ్లు శాసనసభ్యుడు గా బాధ్యతలు వ్యవహిరించారని, దామోదరం సంజీవయ్య కేబినేట్ లో చేనెత, లఘు పరిశ్రమలు, అభ్కారి శాఖ మంత్రి గా పని చేసారని,1969 లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజి చురుకుగా పాల్గోన్నారని, తెలంగాణ ఉద్యమంలో పాల్గోనటం కోసం తన మంత్రి పదవిని కూడా రాజినామా చేసారని, ఉద్యమంలో మొదటి రాజీనామా కోండా లక్ష్మణ్ బాపూజీ చేసారని, ఇటివల జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన తన వంతు కృషి చేసారని తెలిపారు. 97 ఏళ్ల వయస్సులో ఎముకలు కోరికే చలిలో ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనకై నిరహర దీక్ష చేసారని, ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు బడగు బలహిన వర్గాలు అభివృద్ది చేందాలని ఆశించారని అన్నారు. ఆచార్య కోండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకనుగుణంగా మనమంతా కృషి చేయాలని, బాపూజీ 1950లో హైదరాబాద్ హ్యండ్లూమ్ వీవర్స్ సెంట్రల్ కో ఆపరేటివ్ సోసైటీ ని ఏర్పాటు చేసారని, అది కాల క్రమేణ హైకో ఆప్కోగా రూపాంతరం చెందిందని, చేనెత సహకర సంఘానికి ,బీసిల అభివృద్ది కై కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్.పి. చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి అదనపు కలెక్టర్ వేణుగోపాల్, AJC అంకిత్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, బి.సి. వెల్ఫేర్ అధికారి కేశవ్, డి. ఈ. ఓ. రవీందర్ జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్
మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ గులంఖదర్ కలెక్టరేట్ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి చే జారీచేయనైనది.

 

Share This Post