ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి

పూలమాలలు వేసి ఘనంగా నివాళులు

                   000000

 

     స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

       కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ  జయంతి సందర్భంగా ఉజ్వల పార్క్ సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నిస్వార్థ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మహాత్మా గాంధీజీ స్ఫూర్తి తో  దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని అదే విలువలను జీవితాంతం పాటించారని కొనియాడారు.

      ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.  సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరి శంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు వాసాల రమేష్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం, ప్రధానకార్యదర్శి వి.కృష్ణ, వలస భద్రయ్య, గడ్డం శ్రీ రాములు,  సత్యనారాయణ, జి.శ్రీకాంత్, కార్పొరేటర్లు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులు అర్పించారు.

Share This Post