ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 04, 2021ఆదిలాబాదు:-

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకను ప్రభుత్వ పరంగా అన్ని కార్యాలయాలలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 న ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్బంగా అధికారికంగా, ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆరవ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆరవ తేదీన ఉదయం 11 గంటలకు జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ, మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజ్ చేసుకోవాలని పేర్కొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post