ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్బంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ( LB ), జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పత్రిక ప్రకటన,
తేది :- 06.08.2021

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్బంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ( LB ), జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కొసం, నీళ్లు, నిధులు, నియామకాల కొసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి, తెలంగాణ సిద్ధాంతకర్త అని కొనియాడారు. తెలంగాణ సాధన అనంతరం కొత్త జిల్లాలు ఏర్పడ్డయని , వారి ఆశయాలకు అనుగుణంగా కొత్త జిల్లాలలో అధికారులు సిబ్బంది అందరు బంగారు తెలంగాణ సాధన కొసం కృషి చేయాలని కోరారు. కొత్త రాష్ట్రంలో ఏర్పడిన తరువాత త్రాగు నీరు, సాగు నీరుతో పాటు వివిధ రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పలుపంచుకొని బంగారు తెలంగాణ సాధనకు తోడుపడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post