ఆచార్య జయశంకర్ ఆశయాలను సాధించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

ఆచార్య జయశంకర్ ఆశయాలను సాధించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—1                                                                                                                                                                                         తేదీ.6.8.2021

ఆచార్య జయశంకర్ ఆశయాలను సాధించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, ఆగస్టు 06:- ఆచార్య జయశంకర్ ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆయన ఆచార్య జయశంకర్ గారి చిత్రపట్టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆచార్య జయశంకర్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య జయశంకర్ జయంతిని స్టేట్ ఫంక్షన్ లాగా నిర్వహిస్తున్నామని , ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపట్టానికి నివాళులర్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదని, ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక సంక్షేమ అభివృద్ది పథకాలను అధికారులు క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా అమలు చేసి అసలైన నివాళర్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.   స్థానికంగా ఉన్న ఆచార్య జయశంకర్ విగ్రహనికి పుల మాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ గారు చాలా కృషి చేసారని, స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసారని, రాష్ట్ర అభివృద్ది కొరకు మంచి ప్రణాళికలు సైతం రుపొందించారని , ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టంగా కృషి చేయాలని ఆయన తెలిపారు.

మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ ఏ.ఓ., సిబ్బంది, ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారీచేయనైనది.

ఆచార్య జయశంకర్ ఆశయాలను సాధించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

ఆచార్య జయశంకర్ ఆశయాలను సాధించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post